Best Pension Plans: రిటైర్మెంట్‌ తర్వాత బెస్ట్‌ పెన్షన్‌ ప్లాన్స్‌.. హామీతో కూడిన మంత్‌లీ ఇన్‌కమ్‌..!

Best Pension Plans: ప్రతి ఒక్కరూ వయసులో ఉన్నప్పుడు బాగానే సంపదిస్తారు కానీ రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే పరిస్థితిని అంచనా వేసుకోరు.

Update: 2024-03-02 14:30 GMT

Best Pension Plans: రిటైర్మెంట్‌ తర్వాత బెస్ట్‌ పెన్షన్‌ ప్లాన్స్‌.. హామీతో కూడిన మంత్‌లీ ఇన్‌కమ్‌..!

Best Pension Plans: ప్రతి ఒక్కరూ వయసులో ఉన్నప్పుడు బాగానే సంపదిస్తారు కానీ రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే పరిస్థితిని అంచనా వేసుకోరు. ప్రస్తుతానికి డబ్బులు వస్తున్నాయి కాదా అనుకుంటారు భవిష్యత్‌ గురించి ఆలోచించరు. ఇలాంటి వారు వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. అందుకే రిటైర్మెంట్‌ తర్వాత హ్యాపీగా ఉండడానికి పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లు బాగా ఉపయోగపడుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం (SCSS)

ఈ స్కీం ప్రధానంగా సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌. ఇందులో ఒక్కరూ లేదా అంతకంటే ఎక్కువమంది ఇన్వెస్ట్ చేయవచ్చు. పెట్టుబడి కాలవ్యవవధి 5 ఏళ్లు, అదనంగా 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 8.20%. కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి మొత్తాన్ని మధ్యలో విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.30 లక్షల డిపాజిట్‌కు త్రైమాసిక ప్రాతిపదికన రూ.61,600 వడ్డీని అందుకుంటారు. వడ్డీ చెల్లింపు ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌, జనవరి మొదటి తేదీలో పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ పథకానికి ప్రభుత్వ హామీ ఉంటుంది.

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం (POMIS)

ఈ అకౌంట్‌ను దగ్గరలోని పోస్టాఫీసులో ఓపెన్‌ చేయవచ్చు. ఇది ఐదు సంవత్సరాల పెట్టుబడి వ్యవధిని కలిగి ఉంటుంది. గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఒక అకౌంట్‌లో రూ.9 లక్షలు, జాయింట్‌ అకౌంట్లో రూ.15 లక్షలు. దీని ప్రస్తుత వడ్డీ రేటు 7.40%. రూ.9 లక్షల డిపాజిట్‌కు ప్రతి నెలా రూ.5,550 వడ్డీ లభిస్తుంది. ఇది 5 ఏళ్ల పెట్టుబడి వ్యవధిని కలిగి ఉన్నప్పటికీ, అదనంగా ఇంకో 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం. కాబట్టి మెచ్యూరిటీ వరకు మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెలా ఆదాయం కావలసిన సీనియర్‌ సిటిజన్లకు ఇది బాగా సూటవుతుంది.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ)

చాలామంది సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజట్లలో పెట్టుబడి పెడుతారు. దీనిపై వచ్చే వడ్డీతో రోజులు గడుపుతారు. బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు వివిధ కాలవ్యవధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ వడ్డీ రేట్ల కంటే 0.50% అదనపు వడ్డీని అందిస్తాయి. ఈ వడ్డీని డిపాజిట్‌దార్లకు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చెల్లిస్తారు. ప్రముఖ బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు 7 నుంచి 7.50% వడ్డీని అందిస్తున్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు 1 నుంచి 1.50% దాకా అదనపు వడ్డీని అందిస్తాయి. అంతేకాకుండా ఈ డిపాజిట్లకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కూడా ఉంటుంది. భద్రతకు భద్రత ఆదాయానికి ఆదాయం అందుకే సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతారు.

Tags:    

Similar News