Business Idea: స్కూల్లు మొదలయ్యాయి.. ఈ బిజినెస్‌ మొదలు పెడితే భారీగా లాభాలు..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది.

Update: 2024-06-12 15:30 GMT

Business Idea: స్కూల్లు మొదలయ్యాయి.. ఈ బిజినెస్‌ మొదలు పెడితే భారీగా లాభాలు..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. అయితే సరైన అవగాహన లేక, డిమాండ్‌కు తగ్గ వ్యాపారం చేయకపోవడం చాలా మంది నష్టాలు ఎదుర్కొంటుంటారు. అయితే సీజనల్‌ వ్యాపారాల ద్వారా నష్టం అనే మాటకు అవకాశం లేకుండా లాభాలు పొందొచ్చు. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

సమ్మర్ హాలీడేస్‌ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు మళ్లీ బడి బాటపడుతున్నారు. ఇక స్కూల్‌కి వెళ్లగానే మొదట అవసరం వచ్చేది బ్యాగ్స్‌. దీనినే మీరు బిజినెస్‌ ఐడియాగా మార్చుకుంటే భారీగా లాభాలు పొందొచ్చు. అయితే కేవలం బ్యాగ్స్‌ మాత్రమే కాకుండా చిన్నారులకు అవసరయ్యే అన్ని వస్తువులను ఒకే చోట విక్రయిస్తే మంచి గిరాకీ ఉంటుంది. వీటిలో ప్రధానమైంది బుక్స్‌, బూట్లు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌ బాటిల్స్‌, స్టేషనరీ సామాను ఇలా అన్నింటినీ ఒకేచోట విక్రయించి 'బ్యాక్‌ టూ స్కూల్‌' అనే కాన్సెప్ట్‌తో వ్యాపారం చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకోసం మంచి పబ్లిక్ ఏరియాలో ఒక షటర్‌ను అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు.

అయితే కేవలం ఈ సీజన్‌ వరకు మాత్రమే ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ఓ ఆప్షన్‌ ఉంది. తాజాగా కొందరు ఈ బిజినెస్‌ను వినుత్నంగా చేస్తున్నారు. ఇంటి వద్దకు వస్తూ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఆటోల్లో ఉల్లిగడ్డలు, దుస్తులు విక్రయిస్తూ ఊరంతా తిరుగుతున్నారు. ఇలాంటి ఐడియానే స్కూల్ బ్యాగ్స్‌, టిఫిన్‌ బాక్సులు, వాటర్ బాటిల్స్‌కు కూడా అప్లై చేయొచ్చు. దీంతో గిరాకీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. ఒక ఆటో కిరాయికీ తీసుకొని కూడా నడిపించవచ్చు. ఇక ప్రారంభంలో కేవలం ఒక రూ. 10వేలతో బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. హోల్‌సేల్‌లో బ్యాగులు కొనుగోలు చేసి విక్రయిస్తే కచ్చితంగా ఒక్కో బ్యాగుపై కనీసం 30 నుంచి 40 శాతం లాభం లభిస్తుంది. 

Tags:    

Similar News