Investment: నెలకి రూ.1000 పొదుపుతో సులువుగా కోటీశ్వరులు..!
Investment: నెలకి రూ.1000 పొదుపుతో సులువుగా కోటీశ్వరులు..!
Investment: సాధారణంగా ప్రజలు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించాలని కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో అనువైన పెట్టుబడి ఎంపికల కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారికోసం సరైన పెట్టుబడి ఎంపిక ఒకటి ఉంది. ఇందులో మీరు ఇంట్లో కూర్చొని పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలకి యజమాని కావొచ్చు. కానీ దీనికి కొంచెం ఓపిక అవసరమవుతుంది. ఎందుకంటే మంచి లాభాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. అప్పుడే మీరు ఆశించిన లాభాలు పొందుతారు. ఇంతకీ స్కీం ఏంటంటే సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్). దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
సిప్ ద్వారా మీరు ప్రతి నెలా కేవలం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో పెద్ద ఫండ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. దాదాపు 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఫండ్‌ను సృష్టించవచ్చు. ప్రతి నెలా రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే 20% వార్షిక రాబడితో మెచ్యూరిటీపై రూ.86.27 లక్షలను సేకరించవచ్చు. ఇదే అమౌంట్ 30 సంవత్సరాలు 20 శాతం వార్షిక రాబడితో 2,33,60,000 భారీ కార్పస్ ఏర్పడుతుంది.
SIP ప్రయోజనం ఏంటంటే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టే బదులు దీర్ఘకాలం పాటు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉంటుంది. ఇది మీ పెట్టుబడిని ఎప్పటికప్పుడు అంచనా వేయడాన్ని సులభతరం చేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడు కూడా లాభాలను అందిస్తాయి. అలాగే గత కొన్ని సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రజలకు 20 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.