Real Estate: రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఇవి మరిచిపోవద్దు..!
Real Estate: ఈ రోజుల్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో చాలా మార్గాలు ఉన్నాయి.
Real Estate: ఈ రోజుల్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి రియల్ ఎస్టేట్. ఇందులో పెట్టుబడి పెట్టడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. కారణం లాభాలు అధికంగా రావడమే. కానీ ఇది దీర్ఘకాలంలో మాత్రమే జరుగుతుందని గుర్తుంచుకోండి. గత పదేళ్లుగా భాగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ రంగం ఇటీవల కొంచెం తగ్గినట్లు తెలుస్తోంది. కానీ సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా లాభాలు సంపాదించవచ్చు. అందుకే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
లోకేషన్ ముఖ్యం
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి లొకేషన్ చూసుకోవాలి. రైల్వే స్టేషన్‌లు, మెట్రో స్టేషన్‌లు, మార్కెట్‌లు, పాఠశాలలు అన్ని అందుబాటులో ఉండేవిధంగా చూసుకోవాలి. అప్పుడే పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది. అధిక అద్దె ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్న వారు ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిది.
ఆస్తి రకం
పెట్టుబడిదారులు నిర్మాణంలో ఉన్న ఆస్తులలో, పూర్తయిన ప్రాజెక్ట్‌లలో, పునఃవిక్రయం ఉన్న ఆస్తులలో లేదా కొత్త ఆస్తులలో ఈ నాలుగింటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలిసి ఉండాలి. ఒకవేళ పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటే ప్రాజెక్ట్ ఆలస్యాల ఇబ్బందులను నివారించవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రాపర్టీని రెడీ-టు-మూవ్-ఇన్ ప్రాజెక్ట్ కంటే తక్కువ రేటుకు కొనుగోలు చేయవచ్చు. గృహ రుణాలతో అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రాపర్టీ ధర
అభివృద్ది ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశం ఉన్న ప్రాంతాలని ఎంచుకోవాలి. మంచి రాబడిని పొందడానికి మీరు ఆస్తి కొనుగోలు చేసే ఏరియాపై అవగాహన ఉండాలి.
లీగల్ సమస్యలు
ఎలాంటి వివాదాలు లేదా భారాలు లేకుండా ప్రాపర్టీ క్లియర్‌గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. స్థానిక అధికారుల నుంచి అవసరమైన అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ రంగంలో నిపుణుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవాలి.
బడ్జెట్ అండ్ ఫైనాన్సింగ్
పెట్టుబడులకు బడ్జెట్‌ను కేటాయించండి. ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను వెతకండి. కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, పన్నులు, అదనపు ఛార్జీల సహా మొత్తం ఖర్చును విశ్లేషించండి.