No Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐ కింద వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోపోతే మోసపోతారు..!

No Cost EMI: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో నో కాస్ట్‌ ఈఎంఐ అనేది చాలా పాపులర్‌ అయింది.

Update: 2023-02-24 11:30 GMT

No Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐ కింద వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోపోతే మోసపోతారు..!

No Cost EMI: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో నో కాస్ట్‌ ఈఎంఐ అనేది చాలా పాపులర్‌ అయింది. చాలామంది దీనికింద రకరకాల వస్తువులని కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీలు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ని అందిస్తున్నాయి. దీనినే జీరో కాస్ట్ ఈఎంఐ అని కూడా పిలుస్తారు. చాలా ఈ-కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి నో కాస్ట్ EMI ఎంపికను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌ను చూసి చాలామంది వస్తువులని కొనుగోలు చేస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఈ-కామర్స్ వెబ్‌సైట్లు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఆఫర్‌లతో ముందుకు వస్తాయి. చాలా కంపెనీలు, రిటైలర్ దుకాణాలు పండుగ సీజన్‌లో నో కాస్ట్ EMI పథకాలను అందిస్తాయి. దీని కింద మీరు ఎలాంటి వడ్డీ రేటును చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ రుసుముగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ఛార్జీలపై మాత్రం కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల కంపెనీలు కస్టమర్లని మోసం చేసే అవకాశం ఉంది.

నో-కాస్ట్ ఈఎంఐ కింద వడ్డీ లేకుండా నెలవారీ వాయిదా చెల్లించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆఫర్ ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ తీసుకునే వస్తువుల ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక ప్రాసెసింగ్ ఫీజులు, అధిక డెలివరీ ఛార్జీలను దీని కింద దాస్తారు. ఈ పరిస్థితిలో వినియోగదారులు ఆర్డర్ చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు నో కాస్ట్ EMI కింద ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తుంటే ముందుగా ప్రాసెసింగ్ రుసుము ఎంత అని తెలుసుకోవాలి. దీనితో పాటు బ్యాంకు 18% GST కూడా చెల్లించాలి. అంతేకాదు టర్మ్, షరతులు, ఈఎంఐ కాలం, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ ఫీజు, ప్రీపేమెంట్ పెనాల్టీ, ఆలస్య చెల్లింపు ఛార్జీల గురించి తెలుసుకోవాలి.

Tags:    

Similar News