Bank Holidays January 2023: జనవరిలో 11 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays January 2023: డిసెంబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Update: 2022-12-23 08:26 GMT

Bank Holidays January 2023: డిసెంబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నూతన సంవత్సరం 2023 త్వరలో ప్రారంభం కానుంది. అయితే జనవరిలో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. సామాన్యుల జీవితంలో బ్యాంకు చాలా ముఖ్యమైన భాగం. నగదు లావాదేవీల నుంచి చెక్కులు, డ్రాఫ్ట్‌లు జమ చేయడం వరకు ప్రజలు బ్యాంకును సందర్శించాల్సి ఉంటుంది. సుదీర్ఘ సెలవుల కారణంగా ఖాతాదారులు చాలాసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజల సౌకర్యార్థం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. తద్వారా ఖాతాదారులు బ్యాంకు సంబంధిత పనులపై అప్రమత్తంగా ఉంటారు.

ఆర్బీఐ కొత్త సంవత్సర క్యాలెండర్ ప్రకారం జనవరి 2023లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. జనవరిలో బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని ఎదుర్కోవలసి వస్తే ముందుగానే దాన్ని కంప్లీట్‌ చేయండి. అలాగే బ్యాంక్ హాలిడే వల్ల కలిగే సమస్యలను నివారించాలనుకుంటే ఇక్కడ రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను తనిఖీ చేయండి. తరువాత మీ పనిని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

జనవరి 2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా

1 జనవరి 2023 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

2 జనవరి 2023 -నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 3, 2023 - సోమవారం ఇమోయిను ఇరత్పా సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 4, 2023 - మంగళవారం గాన్-నాగై సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

8 జనవరి 2023 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

14 జనవరి 2023 - మకర సంక్రాంతి (రెండో శనివారం)

జనవరి 15 - పొంగల్ / మాగ్ బిహు / ఆదివారం (అన్ని రాష్ట్రాలకు సెలవు)

జనవరి 22, 2023 - ఆదివారం

జనవరి 26, 2023 - గురువారం - గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 28, 2023 - నాలుగో శనివారం

జనవరి 29, 2023-ఆదివారం

Tags:    

Similar News