Banks Holidays: మార్చిలో 13 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా చెక్ చేయండి..
Banks Holidays: మార్చిలో 13 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా చెక్ చేయండి..
Banks Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2022 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. మీరు మార్చిలో బ్యాంకుకు సంబంధించిన పని చేయాలనుకుంటే బ్యాంచ్‌కి వెళ్లేముందు ఖచ్చితంగా సెలవుల జాబితాను చెక్ చేయండి. RBI విడుదల చేసిన జాబితా ప్రకారం మార్చి 2022లో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకుసెలవులు ఉన్నాయి. మార్చిలో మొత్తం 13 రోజుల బ్యాంకు సెలవుల్లో 4 సెలవులు ఆదివారాలు. ఇవి కాకుండా రెండు రెండో, నాలుగో శనివారాలు. మిగతావి ఆయా రాష్ట్రాల పండుగలు, ప్రత్యేకతలని బట్టి ఉంటాయి. అంటే ఆ సెలవులు ఆ రాష్ట్రాల పరిధి వరకే ఉంటాయి. RBI వెబ్‌సైట్‌లో ఇచ్చిన సెలవుల జాబితా ప్రకారం.. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగాఉంటాయి. మార్చి 1 మహాశివరాత్రి సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, షిల్లాంగ్ మినహా ఇతర ప్రదేశాలలో బ్యాంకులు మూసివేస్తారు.
మార్చి 3 గ్యాంగ్ టక్‌లో లోసార్ బ్యాంక్
మార్చి 4 చాప్‌చార్ కుట్ ఐజ్వాల్ బ్యాంక్,
మార్చి 6న ఆదివారం వారపు సెలవుదినం
మార్చి12 శనివారం నెలలో రెండో శనివారం
మార్చి13 ఆదివారం వారపు సెలవుదినం
మార్చి17 హోలి పండుగ డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీలలో బ్యాంకులు మూసివేస్తారు.
మార్చి 18 హోలీ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా,
తిరువనంతపురం కాకుండా ఇతర ప్రదేశాలలో బ్యాంక్‌లు మూసివేస్తారు.
మార్చి19 హోలీ సందర్భంగా భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలలో బ్యాంకులు మూసివేస్తారు.
మార్చి 20 ఆదివారం వారపు సెలవుదినం
మార్చి 22 బీహార్ డే పాట్నాలో బ్యాంక్‌లు క్లోజ్
మార్చి 26 నెలలో నాలుగో శనివారం
మార్చి 27 ఆదివారం వారపు సెలవుదినం