Post Office: పోస్టాఫీసులో కూడా బ్యాంకు మాదిరి సేవలు.. ఈ సదుపాయాలన్ని ఉచితమే..!

Post Office: పోస్టాఫీసులో కూడా బ్యాంకు మాదిరి సేవలు.. ఈ సదుపాయాలన్ని ఉచితమే..!

Update: 2022-12-11 14:30 GMT

Post Office: పోస్టాఫీసులో కూడా బ్యాంకు మాదిరి సేవలు.. ఈ సదుపాయాలన్ని ఉచితమే..!

Post Office: పోస్టాఫీసులో ఖాతా ఉంటే అనేక ఉచిత సౌకర్యాలు లభిస్తాయి. బ్యాంకు లాగే పోస్టాఫీసులో కూడా సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. దీనిపై ఏటీఎం, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి అనేక సౌకర్యాలను పొందుతారు. పోస్టాఫీసులో పొదుపు ఖాతాను తెరిచి ఉంటే ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని సహాయంతో లావాదేవీలు చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో ఏటీఎం దరఖాస్తు చేయడానికి ముందుగా ఫారమ్ నింపాలి. ఏటీఎం మాత్రమే కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS, మొబైల్ బ్యాంకింగ్ సేవలని కూడా అభ్యర్థించవచ్చు. అయితే ఫారమ్‌తో పాటు పాస్‌బుక్‌ను జతచేయవలసి ఉంటుంది. మీ సొంత బ్రాంచ్‌లో పోస్ట్ మాస్టర్ అన్ని తనిఖీలను చేసి ఏటీఎం జారీ చేస్తారు. తర్వాత ATM కార్డ్, పాస్‌బుక్ రెండింటినీ తీసుకోవచ్చు.

ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసిన ఏటీఎం కార్డ్‌తో ప్రతిరోజూ గరిష్టంగా 25,000 రూపాయల వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఒక లావాదేవీకి రూ. 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారుడు ఏదైనా పోస్టాఫీసు ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేస్తే, ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

పోస్టాఫీసు ఏటీఎం కార్డుతో మెట్రో నగరాల్లో 3 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. మరొక బ్యాంకు ఏటీఎంలో ఉచిత లావాదేవీ పరిమితికి మించి నగదును విత్‌డ్రా చేస్తే రూ. 20 + GST ఛార్జ్ చెల్లించాలి. ఇండియా పోస్ట్ వినియోగదారులకు అన్ని పోస్టాఫీసు ఏటీఎంల నుంచి ఉచిత లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే ఒక రోజులో 5 ఆర్థిక లావాదేవీలు మాత్రమే చేయవచ్చు. ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంల నుంచి కస్టమర్లందరికీ ఉచిత లావాదేవీ సౌకర్యాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News