Home Loan: హోమ్‌లోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే..!

Home Loan: హోమ్‌లోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే..!

Update: 2022-04-25 04:49 GMT

Home Loan: హోమ్‌లోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే..!

Home Loan: మీరు త్వరలో మీ డ్రీమ్ హోమ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది మీకు శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్ల కోసం చౌక గృహ రుణ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వడ్డీ రేటు ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. మిగిలిన బ్యాంకులు రుణ రేట్లను పెంచుతుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇటీవల బ్యాంక్ తన MCLR ను 0.05 శాతం పెంచింది. తర్వాత కూడా బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం.

మీరు ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాన్ని పొందాలనుకుంటే 30 జూన్ 2022లోపు మీరు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. జూన్ 30, 2022లోపు బ్యాంకులో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే మీరు ఈ మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఏదైనా ఇతర బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దానిని బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా దాదాపు 6.5 శాతం వడ్డీ రేటుతో రుణం పొందుతారు. దీంతో పాటు మీరు ప్రాసెసింగ్ ఫీజుపై ప్రత్యేక తగ్గింపు ప్రయోజనం కూడా పొందుతారు. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 22 ఏప్రిల్ 2022 నుంచి 30 జూన్ 2022 వరకు ఏదైనా హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ మీ నుంచి ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమును కూడా వసూలు చేయదు.

Tags:    

Similar News