బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అకౌంట్‌ ఉందా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Bank of Baroda: రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లు పెంచిన తర్వాత వివిధ బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్నాయి.

Update: 2022-08-12 06:34 GMT

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అకౌంట్‌ ఉందా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Bank of Baroda: రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లు పెంచిన తర్వాత వివిధ బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా పేరు కూడా ఇందులో చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వివిధ రుణాల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (MCLR) ఆధారిత రుణ రేటును 0.20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వచ్చాయి.

బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఒక సంవత్సర కాలానికి బెంచ్‌మార్క్ MCLR 7.65 శాతం నుంచి 7.70 శాతానికి పెరిగింది. ఖాతాదారుల రుణాల వడ్డీ రేట్లు దీని ఆధారంగా నిర్ణయిస్తారు. ఒక నెల వ్యవధి రుణాలకు MCLR 0.20 శాతం నుంచి 7.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో మూడు నెలల, ఆరు నెలల రుణాలపై వరుసగా 7.45, 7.55 శాతానికి MCLR ను 0.10 శాతం పెంచాలని నిర్ణయించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత వారం కీలకమైన పాలసీ రేటు రెపోను 0.50 శాతం పెంచింది. దీని తర్వాత చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా రుణ రేటును పెంచాయి. రేట్ల పెంపు ఆగస్ట్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రెపో సంబంధిత రుణ రేటు (RLLR) 7.40 శాతం నుంచి 7.90 శాతం పెంచింది. ఇది ఆగస్టు 8 నుంచి అమలులోకి వచ్చింది.

Tags:    

Similar News