Bank Holidays: సెప్టెంబర్‌లో 13 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays: సెప్టెంబర్‌లో 13 రోజులు బ్యాంకులు బంద్‌..!

Update: 2022-08-24 05:49 GMT

Bank Holidays: సెప్టెంబర్‌లో 13 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays: ఆగస్టు నెల ముగియబోతుంది. అయితే ఆగస్ట్‌ మాదిరిగానే సెప్టెంబర్‌లో కూడా చాలా రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. మీకు వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకోవడం బెటర్. లేదంటే అప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్‌లో ఆదివారాలు మినహా ఇతర సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం.

వివిధ రాష్ట్రాల ప్రకారం సెలవులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్‌లో మొత్తం 8 సెలవులు ఉంటున్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు 6 రోజులు వస్తున్నాయి. దీంతో మొత్తం నెలలో 13 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. నెల ప్రారంభంలో సెప్టెంబర్ 1న గణేష్ చతుర్థి కారణంగా గోవాలోని పనాజీలో బ్యాంకులు మూసివేస్తారు.

తర్వాత సెప్టెంబర్ 6న కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఓనం సందర్భంగా సెప్టెంబర్ 7, 8 తేదీల్లో తిరువనంతపురం, కొచ్చిలో బ్యాంకులు మూసివేస్తారు. సెప్టెంబర్ 9న ఇంద్రజాత కారణంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు. ఆర్‌బిఐ క్యాలెండర్ ప్రకారం శ్రీ నరవణే గురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 10న కేరళలోని తిరువనంతపురం, కొచ్చి బ్యాంకులు మూసివేస్తారు.

సెప్టెంబరు 21న తిరువనంతపురం, కొచ్చిలో కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ రోజున శ్రీ నారాయణ గురు సమాధి దినం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 26న నవరాత్రుల స్థాపన కారణంగా మణిపూర్‌లోని జైపూర్‌, ఇంఫాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది కాకుండా సెప్టెంబర్ 24వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులు జరగవు.

సెప్టెంబర్ 1వ తేదీ గణేష్ చతుర్

సెప్టెంబర్ 4----ఆదివారం

సెప్టెంబర్ 6----కర్మ పూజ

7వ,8 ----ఓనం

9 సెప్టెంబర్--ఇంద్రజట

10 సెప్టెంబర్----శ్రీ నరవనే గురు జయంతి

సెప్టెంబర్ 11వ తేదీ 2వ శనివారం

సెప్టెంబర్ 18వ తేదీ ఆదివారం

సెప్టెంబర్ 24వ తేదీ--నాల్గవ శనివారం

సెప్టెంబర్ 26 ఆదివారం సెలవు

Tags:    

Similar News