Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. మే నెలలో బ్యాంకుకి సంబంధించి ఏదైనా పని ఉంటే ముందుగానే చేసుకోండి.

Update: 2023-05-01 05:04 GMT

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. మే నెలలో బ్యాంకుకి సంబంధించి ఏదైనా పని ఉంటే ముందుగానే చేసుకోండి. మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు. లేదంటే సెలవు రోజుల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కసారి సెలవుల జాబితాని తనిఖీ చేయండి. ఆర్బీఐ రాష్ట్రాల పండుగల ప్రకారం సెలవులను ప్రకటించింది. శనివారం, ఆదివారం కాకుండా ఈ నెలలో రాష్ట్రాలలో వచ్చే కొన్ని ప్రత్యేక సెలవులు ఉన్నాయి. వాటి గురంచి పూర్తిగా తెలుసుకుందాం.

మే నెలలో దేశంలోని వివిధ బ్యాంకులు 12 రోజులపాటు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. ఈ 12 రోజుల్లో 4 ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి. అంటే ఆరు రోజులు శని, ఆదివారాలు సెలవులుంటే మరో 6 రోజులు ఇతర సెలవులున్నాయి.

పబ్లిక్ హాలిడేస్:

మే 7 ఆదివారం

మే 13 రెండవ శనివారం

మే 14 ఆదివారం

మే 21 ఆదివారం

మే 27 నాలుగవ శనివారం

మే 28 ఆదివారం

పండుగ సెలవులు:

మే 1 – మేడే(కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, బెంగాల్, గోవా, బీహార్‌)

మే 2: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు(సిమ్లా)

మే 5 – బుద్ద పూర్ణిమ(త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్)

మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి(పశ్చిమ బెంగాల్)

మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కిం)

మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి(హిమాచల్ ప్రదేశ్)

మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి (త్రిపుర)

Tags:    

Similar News