Bank Holidays: మార్చిలో బ్యాంకులకి 12 రోజులు సెలవులు.. పూర్తి జాబితాను తెలుసుకోండి..!

Bank Holidays: మార్చిలో మొత్తం 12 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి.

Update: 2023-02-23 11:13 GMT

Bank Holidays: మార్చిలో బ్యాంకులకి 12 రోజులు సెలవులు.. పూర్తి జాబితాను తెలుసుకోండి..!

Bank Holidays: మార్చిలో మొత్తం 12 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. అందువల్ల వచ్చే నెలలో బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగానే చేసుకోండి. లేదంటే సెలవుల జాబితాని ఒకసారి చెక్‌ చేయండి. భారతదేశంలో బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పనిచేస్తాయి. కానీ రెండవ, నాల్గవ శనివారాలు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం మార్చి 2023లో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకి 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ లిస్టుని ఒక్కసారి తెలుసుకుందాం.

మార్చి 2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా

1. మార్చి 3 చాప్చార్ కుట్

2. మార్చి 5 ఆదివారం

3. మార్చి 7 హోలీ / హోలీ (రెండవ రోజు) / హోలికా దహన్ / ధులండి / డోల్ జాత్రా

4. మార్చి 8 ధూలేటి / డోల్జాత్రా / హోలీ / యయోసాంగ్ రెండవ రోజు

5. మార్చి 9 హోలీ

6. మార్చి 11 నెలలో రెండవ శనివారం

7. మార్చి 12 ఆదివారం

8. మార్చి 19 ఆదివారం

9. మార్చి 22 గుడి పడ్వా / ఉగాది పండుగ / బీహార్ డే / సాజిబు నొంగ్మపన్బా (చీరఓబా) / తెలుగు నూతన సంవత్సర దినం / మొదటి నవరాత్రి

10. మార్చి 25 నాల్గవ శనివారం

11. మార్చి 26 ఆదివారం

12. మార్చి 30 శ్రీరామ నవమి

మొదటి బ్యాంక్ సెలవుదినం మార్చి 3న చాప్‌చార్ కుట్ నుంచి ప్రారంభమవుతుంది. గుడి పడ్వా/ఉగాది పండుగ/బీహార్ దివస్ వంటి ఇతర సెలవులు మార్చి 22న వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు ఆర్‌బీఐ క్యాలెండర్‌ ప్రకారం సెలవులు పాటిస్తాయి. మార్చిలో నాలుగు ఆదివారాలు ఉన్నాయి. అవి మార్చి 5,12,19, 26 తేదీలలో వస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు మార్చి 11, 25 తేదీలలో ఉన్నాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం RBI మార్చి 3, 7, 8, 9, 22, 30 తేదీలలో సెలవు ప్రకటించింది. ఇది కాకుండా RBI క్యాలెండర్ ప్రకారం మార్చి 2023లో బ్యాంకులకు ఆరు సెలవులు ఉన్నాయి.

Tags:    

Similar News