Bank Holidays: జులైలో 15 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదిగో..!

Bank Holiday in India: జులై 2023లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి అన్ని ప్రభుత్వ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులు పనిచేయవు.

Update: 2023-06-22 13:30 GMT

Bank Holidays: జులైలో 15 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదిగో..!

Bank Holiday in July: ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. మరికొద్ది రోజుల్లో జూన్ నెల ముగిసి జులై నెల ప్రారంభం కానుంది. అదే సమయంలో జులై నెలలో, కొన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, జులైలో బ్యాంకుకు వెళ్లే ముందు, బ్యాంకు సెలవులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. జూన్ నెలాఖరుతో, సంవత్సరంలో 6 నెలలు కూడా ముగుస్తాయి.

జులైలో బ్యాంకింగ్ సెలవులు..

జులై 2023లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి అన్ని ప్రభుత్వ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలోనూ బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. జులై నెలలో 15 బ్యాంకు సెలవులు ఉన్నాయి.

జులైలో సెలవులు ఇలా ఉన్నాయి-

జులై 4 ఆదివారం సెలవు

జులై 5 గురు గోవింద్ జయంతి-జమ్ము, శ్రీనగర్‌లో సెలవు

జులై 6 మిజోరాంలో ఎంహెచ్ఐపీ సెలవు

జులై 8 2వ శనివారం

జులై 9 ఆదివారం

జులై 11 త్రిపురలో కేరా పూజా సందర్భంగా సెలవు

జులై 13 సిక్కింలో భాను జయంతి సెలవు

జులై 16 ఆదివారం

జులై 17 మేఘాలయలో యూ తిరోట్ సింగ్ డే

జులై 22 4వ శనివారం

జులై 23 ఆదివారం

జులై 29 మొహర్రం

జులై 30 ఆదివారం

జూలై 31 హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో షహాదత్ సెలవు

Tags:    

Similar News