Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు పనిదినాలు 10 రోజులు మాత్రమే..!

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు పనిదినాలు 10 రోజులు మాత్రమే..!

Update: 2022-10-02 12:30 GMT

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు పనిదినాలు 10 రోజులు మాత్రమే..!

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుకు సంబంధించి ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఈ విషయం తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం అక్టోబర్‌లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు రానున్నాయి. వాస్తవానికి RBI సెలవులను మూడు కేటగిరీలుగా విభజించింది.

వీటిలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌లు అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి ఉంటాయి. అంటే జాతీయ సెలవుదినాలకు అదనంగా కొన్ని రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు కూడా ఉంటాయి. వీటిలో అన్ని ఆదివారాలు అలాగే నెలలోని రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉంటాయి. అక్టోబ‌ర్ నెల‌లో బ్యాంకులకి ఏయే రోజుల్లో సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులు

అక్టోబరు 1 - బ్యాంకు అర్ధ సంవత్సర ముగింపు (దేశమంతటా సెలవు)

అక్టోబర్ 2 - ఆదివారం, గాంధీ జయంతి సెలవు (దేశమంతటా)

అక్టోబర్ 3 - మహా అష్టమి (దుర్గా పూజ) (అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతాలో సెలవు)

అక్టోబర్ 4 – మహానవమి / శ్రీమంత శంకరదేవ పుట్టినరోజు (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, గౌహతి, కోల్‌కతా, చెన్నై, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలో బ్యాంకులకి సెలవు)

అక్టోబర్ 5 – దుర్గ పూజ / దసరా (విజయ దశమి) (దేశమంతటా సెలవు)

6 అక్టోబర్ - దుర్గా పూజ (దసాయి) (గ్యాంగ్‌టక్‌లో సెలవు)

7 అక్టోబర్ - దుర్గా పూజ (దసాయి) (గ్యాంగ్‌టక్‌లో సెలవు)

8 అక్టోబర్ - రెండవ శనివారం సెలవు అలాగే మిలాద్-ఎ-షరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం) (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో సెలవు)

అక్టోబర్ 9 - ఆదివారం

అక్టోబర్ 13 - కర్వా చౌత్ (సిమ్లా)

14 అక్టోబర్ - ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్‌లో సెలవు)

16 అక్టోబర్ - ఆదివారం

18 అక్టోబర్ - కటి బిహు (గౌహతిలో సెలవు)

22 అక్టోబర్ - నాల్గవ శనివారం

23 అక్టోబర్ - ఆదివారం

24 అక్టోబర్ - కాళీ పూజ /దీపావళి/నరక్ చతుర్దశి) (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా సెలవు)

25 అక్టోబర్ - లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్‌లలో సెలవు)

26 అక్టోబర్ - గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవత్ నూతన సంవత్సర దినం/భాయ్ దూజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ/ప్రవేశ దినం (అహ్మదాబాద్, బెంగళూరు, బెంగళూరు, డెహ్రాడూన్, గగ్టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్ లో సెలవు

అక్టోబరు 27 - భాయ్ దూజ్ / చిత్రగుప్త జయంతి / లక్ష్మీ పూజ / దీపావళి / నింగోల్ చక్కుబా (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నోలో సెలవు)

30 అక్టోబర్ - ఆదివారం

31 అక్టోబర్ - సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు / సూర్య షష్టి దాలా అర్ఘ్యత్ (ఉదయం) / ఛత్ పూజ (అహ్మదాబాద్, రాంచీ, పాట్నాలో సెలవు)

Tags:    

Similar News