Bank Holidays: ఫిబ్రవరిలో 6 రోజులు బ్యాంకులు బంద్.. లిస్టు చెక్ చేసుకోండి..?

Bank Holidays: బ్యాంకులలో ఏదైనా అత్యవసర పని ఉంటే వెంటనే పూర్తి చేసుకుంటే బెటర్.

Update: 2022-01-27 02:30 GMT

Bank Holidays: ఫిబ్రవరిలో 6 రోజులు బ్యాంకులు బంద్.. లిస్టు చెక్ చేసుకోండి..?

Bank Holidays: బ్యాంకులలో ఏదైనా అత్యవసర పని ఉంటే వెంటనే పూర్తి చేసుకుంటే బెటర్. ఎందుకంటే వచ్చే ఫిబ్రవరిలో 6 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ రోజులలో బ్యాంకు సేవలు ఆగిపోతాయి కాబట్టి ఖాతాదారులు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఒక్కసారి బ్యాంకు సెలవుల జాబితాని చూసుకొని ప్రణాళిక వేసుకుంటే అనుకున్న సమయానికి పనులు జరుగుతాయి. అయితే కొన్ని సెలవులు జాతీయ స్థాయిలో మరికొన్ని రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారని గుర్తుంచుకోండి.

బ్యాంకులకు సెలవులు అంటే షట్టర్ డౌన్ కానీ బ్యాంకింగ్ పనులు పూర్తిగా ఆగిపోవు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మునుపటిలానే కొనసాగుతాయి. సెలవుల్లో కూడా మీరు మీ పనిని నిర్వహించుకోవచ్చు. కానీ ఖాతాదారులు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయలేరు లేదా బ్రాంచ్ నుంచి డబ్బు విత్ డ్రా చేయలేరు. ఇలాంటి సేవలు ఏటీఎంలలో మాత్రం అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ పనులు కొనసాగుతాయి.

12 ఫిబ్రవరి, 26 ఫిబ్రవరి తేదీలలో రెండు, నాల్గవ శనివారాలు బ్యాంకులు మూసివేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీలలో ఆదివారం బ్యాంకులు మూసివేస్తారు. ఈ రోజుల్లో దేశంలోని అన్ని బ్యాంకులు ఒకే సమయంలో మూసివేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న అన్ని బ్యాంకులు మూసివేస్తారు. అగర్తల, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, శ్రీనగర్లలో జనవరి 26న బ్యాంకులు పనిచేస్తాయి. మీకు బ్యాంకులో ఏదైనా పెండింగ్లో ఉన్న పని ఉంటే అలాంటి పనిని వాయిదా వేయకండి. వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News