SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీంలో మరిన్ని మార్పులు..!

SBI Customers: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారులకి మరో శుభవార్త తెలిపింది.

Update: 2023-07-06 09:21 GMT

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీంలో మరిన్ని మార్పులు..!

SBI Customers: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారులకి మరో శుభవార్త తెలిపింది. సంపాదించడానికి మరో గొప్ప అవకాశాన్ని కల్పించింది. 400 రోజుల ప్రత్యేక FD పథకం అయిన అమృత్ కలాష్‌లో పెట్టుబడి పరిమితిని బ్యాంక్ పెంచింది. వాస్తవానికి కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి ఈ స్పెషల్‌ ఎఫ్డీ పథకం ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి చివరి అవకాశం జూన్ 30గా తెలిపారు కానీ ప్రస్తుతం బ్యాంక్ ఆగస్టు 15, 2023 వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో పెట్టుబడిదారులు మరిన్ని లాభాలను పొందే అవకాశం ఉంది.

ఎస్బీఐ అమృత్ కలాష్‌ స్కీంని 15 ఫిబ్రవరి 2023న ప్రారంభించింది. ఇందులో సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అమృత్ కలాష్ డిపాజిట్‌లో ప్రీమెచ్యూర్, లోన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అమృత్ కలాష్ స్కీంలో 400 రోజులు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీరేటు అందిస్తోంది. ఇది బ్యాంక్ ప్రత్యేక V కేర్ పథకం కంటే ఎక్కువ. ఎస్బీఐ వి కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి 5 నుంచి 10 సంవత్సరాలు. ఇందులో వ్యక్తిగత వడ్డీ రేటు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం అందిస్తున్న విషయం తెలిసిందే.

వడ్డీ, పన్ను వివరాలు

ఈ పథకంపై వడ్డీ నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక వ్యవధిలో చెల్లిస్తారు. టీడీఎస్‌ తీసివేసిన తర్వాత మెచ్యూరిటీ వడ్డీ కస్టమర్ ఖాతాకు కలుపుతారు. ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఎస్బీఐ అమృత్ కలాష్ పథకం బాగా సెట్‌ అవుతుంది. అమృత్ కలాష్ డిపాజిట్‌లో ప్రీమెచ్యూర్, లోన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఎఫ్డీ మొత్తాన్ని ముందస్తుగా విత్‌డ్రా చేస్తే డిపాజిట్ సమయంలో వర్తించే వడ్డీ రేటుపై 0.50% నుంచి 1% వరకు జరిమానా విధించవచ్చు.

Tags:    

Similar News