Axis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..!
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..!
Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉంటే ఈ వార్త మీ కోసమే. యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులను కుదిపేస్తూ సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను పెంచింది. ఈ ప్రభావం వినియోగదారులందరిపైనా ఉంటుంది. బ్యాంకు ఈ కొత్త నియమం జూన్ 1 నుంచి వర్తిస్తుంది. ఖాతాలో నిర్వహించాల్సిన కనీస నిల్వల పరిమితిని బ్యాంక్ పెంచింది. మీరు పెరిగిన బ్యాలెన్స్‌ను కొనసాగించలేకపోతే నెలవారీ సేవా ఛార్జీ మునుపటి కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
జూన్ 1, 2022 నుంచి పొదుపు / జీతం ఖాతాల టారిఫ్ నిర్మాణాన్ని మారుస్తున్నట్లు బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ మెయింటనెన్స్ బ్యాలెన్స్ రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఇది కాకుండా ఆటో డెబిట్ సక్సెస్ కానందుకు పెనాల్టీని పెంచారు. ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేకపోతే ఎక్కువ సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో, పట్టణ ప్రాంతాలకు గరిష్టంగా నెలవారీ సర్వీస్ ఛార్జీ ఇప్పుడు రూ.600 అవుతుంది. సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.300, గ్రామీణ ప్రాంతాలకు రూ.250గా ఉండనుంది.
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) విఫలమైతే రుసుము రూ. 500కి పెరిగింది. దీని కింద మొదటి సారి రూ.375, రెండోసారి 425, మూడోసారి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆటో డెబిట్ ఫెయిల్యూర్‌పై ఛార్జీ కూడా రూ.50 పెరిగి రూ.200 నుంచి రూ.250కి పెరిగింది. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి చెక్ బుక్ జారీ చేస్తే దానికి కూడా ఎక్కువ ధర చెల్లించాలి. ఒక్కో లీఫ్ చెక్ బుక్ ధర రూ.2.50 నుంచి రూ.4కు పెరిగింది. ఈ మార్పు కూడా జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. భౌతిక వివరాలు, డూప్లికేట్ పాస్ బుక్ ఫీజులకు రూ.75 బదులు ఇప్పుడు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.