Ayushman Bhav: 'ఆయుష్మాన్ భవ' ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. ఎవరికి ప్రయోజనం, ఇందులో ప్రత్యేకత ఏంటో తెలుసా?
Ayushman Bhav: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అంటే ఈరోజు రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Ayushman Bhav: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అంటే ఈరోజు రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఆయుష్మాన్ భవ' అనేది దేశవ్యాప్త కార్యక్రమం. ఇది దేశంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఆరోగ్య సేవలను విస్తృతంగా యాక్సెస్ చేయడానికి ఉద్దేశించింది. 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమం విజయవంతమైన దృష్ట్యా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ప్రచారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 17 నుంచి అమలులోకి వస్తుంది. ఈ ప్రచారం కింద, ఆయుష్మాన్ పథకంతో అనుబంధించబడిన అన్ని ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆయుష్మాన్ మేళాలు నిర్వహించనున్నారు.
అన్ని మెడికల్ కాలేజీలు, బ్లాకుల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. అర్హులైన వారికి వెంటనే కార్డులు అందజేస్తారు. దేశంలోని అన్ని జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, బ్లాక్‌లలో క్యాంపులు నిర్వహించనున్నారు. వాస్తవానికి, ఆయుష్మాన్ భవ ప్రచారం అనేది దేశవ్యాప్త ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. దీని లక్ష్యం దేశంలోని ప్రతి గ్రామం మరియు పట్టణానికి ఆరోగ్య సేవలను అందించడం. గత మంగళవారం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సేవా పఖ్వాడా సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.
60 వేల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు..
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సేవలతో పాటు రక్తదానం, అవయవ దాన ప్రచారాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో శిబిరాలు నిర్వహించి 60 వేల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భవ ప్రారంభానికి జరుగుతున్న సన్నాహాలను సమీక్షించేందుకు మన్సుఖ్ మాండవియా ఆరోగ్య మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులతో వర్చువల్ సంభాషణను నిర్వహించారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమం కింద, ఆయుష్మాన్ మేళా కింద సుమారు 1.17 లక్షల ఆయుష్మాన్ భారత్-హెచ్‌డబ్ల్యుసీలు, సీహెచ్‌సీలలో ABHA IDలను రూపొందించే పని కూడా జరుగుతుంది.