ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన మరో బ్యాంకు..!
Axis Bank: ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి తర్వాత ఇప్పుడు ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మార్చింది.
Axis Bank: ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి తర్వాత ఇప్పుడు ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మార్చింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి FD వడ్డీ రేట్లను మార్చాయి. బ్యాంకుల తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా మూడేళ్ల ఎఫ్‌డిపై పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఈ మార్పులు మార్చి 5 నుంచి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పు చేసింది. బ్యాంకు కొత్త రేట్లు ఏంటో తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్ ప్రకారం.. 18 నెలల నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. అదే సమయంలో 2 నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వినియోగదారులకు 5.40 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో 3 నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ దీర్ఘకాలిక డిపాజిట్లపై 5.40 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ రేటు 5.75 శాతం. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే.
సీనియర్ సిటిజన్లకు FD రేటు
ఇప్పుడు సీనియర్ సిటిజన్ల గురించి మాట్లాడుకుందాం. సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీని పొందుతారు. రేట్లను ఒకసారి పరిశీలిద్దాం.
బ్యాంక్ విడుదల చేసిన కొత్త రేట్లు
18 నెలలు < 2 సంవత్సరాలు - వడ్డీ రేటు 5.25%
2 సంవత్సరాలు < 30 నెలలు - వడ్డీ రేటు 5.40%
30 నెలలు < 3 సంవత్సరాలు - వడ్డీ రేటు 5.40%
3 సంవత్సరాలు < 5 సంవత్సరాలు - వడ్డీ రేటు 5.40%
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు - వడ్డీ రేటు 5.75%