ATM Alert: ఏటీఎం అలర్ట్.. కొత్త విధానంలో మోసాలు జాగ్రత్తగా లేకుంటే భారీనష్టం..!
ATM Alert: ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంని ఉపయోగిస్తున్నారు.
ATM Alert: ఈ రోజుల్లో చాలా మంది బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వారి అవసరాలకి అనుగుణంగా డబ్బులు పొందుతున్నారు. అయితే ఏటీఎంను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో నేరస్థులు ఏటీఎంలకి సంబంధించిన మోసాలకి పాల్పడుతున్నారు. దీని కోసం స్కిమ్మింగ్‌ను ఉపయోగిస్తున్నారు. స్కిమ్మింగ్ అంటే ఏంటి.. దానిని ఎలా నివారించవచ్చో ఈరోజు తెలుసుకుందాం.
స్కిమ్మింగ్ అంటే ఏమిటి?
స్కిమ్మింగ్ ప్రక్రియలో ఏటీఎం కార్డులో ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా సమాచారం దొంగిలిస్తారు. నేరస్థులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల వెనుక భాగంలో ఇచ్చిన మాగ్నెటిక్ స్ట్రిప్‌ను చదవడం ద్వారా ఈ సమాచారాన్ని పొందుతారు. దీనికోసం వారు ఏటీఎం మిషన్‌లకి చిన్న పరికరాన్ని అటాచ్ చేస్తారు. అది కార్డు వివరాలను స్కాన్ చేసి స్టోర్ చేస్తుంది. ఇది కాకుండా పిన్‌ను క్యాప్చర్ చేయడానికి చిన్న కెమెరా కూడా వాడుతారు. ఏటీఎంలు, రెస్టారెంట్లు, దుకాణాలు లేదా ఇతర ప్రదేశాలలో స్కిమ్మింగ్ ఎక్కువగా జరుగుతుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
1. ఏటీఎం దగ్గర PINని నమోదు చేస్తున్నప్పుడు మరో చేత్తో కీప్యాడ్‌ను కవర్ చేయండి.
2. ఏటీఎంలో ఏదైనా తప్పుగా కనిపించినా లేదా కీప్యాడ్ సరిగ్గా లేకపోయినా లావాదేవీని ఆపివేసి విషయం బ్యాంకుకు తెలియజేయండి.
3. కార్డ్ స్లాట్ లేదా కీప్యాడ్‌లో ఏదైనా చిక్కుకుపోయిందని అనుమానించినట్లయితే దాన్ని ఉపయోగించవద్దు. లావాదేవీని రద్దు చేసి వదిలివేయండి.
4. తెలియని వ్యక్తి ఫోన్ చేసి సహాయం కోరితే అప్రమత్తంగా ఉండండి. మీ దృష్టిని మరల్చడానికి చేస్తున్నారని అర్థం చేసుకోండి.
5. మీ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.