Car Loan Offers: కారు లోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ బ్యాంకుల ఆఫర్లు గమనించండి..!

Car Loan Offers: కారు కొనాలని చాలామందికి ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిం చక వాయిదా వేస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు కారు లోన్‌ ఆఫర్‌ చేస్తూ ఉంటాయి.

Update: 2024-05-11 12:05 GMT

Car Loan Offers: కారు లోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ బ్యాంకుల ఆఫర్లు గమనించండి..!

Car Loan Offers: కారు కొనాలని చాలామందికి ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిం చక వాయిదా వేస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు కారు లోన్‌ ఆఫర్‌ చేస్తూ ఉంటాయి. వీటి ద్వారా సులువుగా కారు కొనుగోలు చేసి మీ కలను నెరవేర్చుకోవ చ్చు. అయితే నెల నెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కారు లోన్లపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వివిధ బ్యాంకులు కారులోన్లపై వసూలు చేస్తున్న వడ్డీరేట్ల గురించి తెలుసుకుందాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 8.70 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇందులో ఈఎంఐ రూ.24,565 అవుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్‌పై 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లతో సహా ఇతర బ్యాంకులు కూడా నాలుగేళ్లకు 8.75 శాతం వడ్డీకి కార్ లోన్‌లను అందిస్తున్నాయి. ఇందులో ఈఎంఐ రూ.24,587.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్‌పై 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీని ఈఎంఐ రూ. 24,632 అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగేళ్ల కాలానికి రూ. 10 లక్షల కారు లోన్‌పై 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఈఎంఐ రూ. 24,655 అవుతుంది.

ICICI బ్యాంక్

ICICI బ్యాంక్ నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 9.10 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఈఎంఐ రూ. 24,745 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ నాలుగేళ్ల కాలానికి 9.30 శాతం వడ్డీ రేటుతో రూ.10 లక్షల కారు లోన్‌ అందిస్తోంది. ఈ సందర్భంలో ఈఎంఐ రూ. 24,835 అవుతుంది.

HDFC బ్యాంక్

ఈ బ్యాంక్ నాలుగేళ్ల కాలానికి 9.40 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్‌ను అందిస్తోంది. రూ.10 లక్షల కార్ లోన్‌పై ఈఎంఐ రూ. 24,881 అవుతుంది.

Tags:    

Similar News