Child Future: మీ పిల్లల భవిష్యత్ కోసం ప్లాన్ చేస్తున్నారా.. అయితే వీటిని మరిచిపోకండి..!
Child Future: కరోనా వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
Child Future: కరోనా వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారి భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారు. అందుకోసం సరైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పిల్లలకి అందమైన భవిష్యత్ అందించాలంటే కచ్చితంగా వారికోసం డబ్బులు పొదుపు చేయాల్సిందే. అప్పుడే వారి విద్య, వివాహం, ఉద్యోగం సవ్యంగా సాగుతాయి. అయితే ఏ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఈ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఇది ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ. 1.5 లక్షల పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. పిల్లల ఖాతాలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కాల పరిమితి 15 సంవత్సరాలు.
సుకన్య సమృద్ధి యోజన
మీ కుమార్తె కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, సుకన్య సమృద్ధి యోజన మంచి ఎంపిక అవుతుంది. మీరు ఇందులో సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 పెట్టుబడి పెట్టాలి. అలాగే గరిష్టంగా ఒక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడితే మీకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకి 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె చదువుల కోసం అలాగే అమ్మాయికి 21 ఏళ్లు నిండితే పెళ్లి కోసం ఈ డబ్బును తీసుకోవచ్చు.
మీరు మీ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్ సిప్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ లో పెట్టుబడి పెట్టడానికి మీరు రూ.100తో చిన్న మొత్తంలో ప్రారంభించవచ్చు. వీటితో పాటు బ్యాంకులో డబ్బు ఆదా చేయాలని ప్లాన్ చేస్తుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపిక. మీరు మీ పిల్లల కోసం 5 నుంచి 10 సంవత్సరాలకు పిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఇలాంటి ప్లాన్‌లు ఎంచుకోవడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అలాగే మంచి రాబడి సంపాదించవచ్చు.