వయసు ముప్పై దాటిందా.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Investment Plans: మీ వయసు 30 ఏళ్లు దాటిందా.. మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించలేదా.. అయితే వెంటనే ప్రారంభించండి.

Update: 2022-08-20 11:30 GMT

వయసు ముప్పై దాటిందా.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Investment Plans: మీ వయసు 30 ఏళ్లు దాటిందా.. మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించలేదా.. అయితే వెంటనే ప్రారంభించండి. లేదంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే జీవితంలో పెట్టుబడులు, పొదుపు అనేది కచ్చితంగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే ఇప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేయాలో తెలుసుకుందాం.

సిప్‌ మొదలుపెట్టండి: నేటి కాలంలో పొదుపు అనేది చాలాముఖ్యం. అయితే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు. అలాంటివారికి సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) కరెక్ట్‌గా సూటవుతుంది. 25 ఏళ్ల వయసులోనే దీనిని ప్రారంభిస్తే మీరు రిటైర్‌ అయ్యేసరికి మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లైతే ఇష్టం వచ్చినపుడు వాటిని అమ్మేయడమో, తొలగించడమో జరుగుతుంది. దీనివల్ల వృద్ధి చెందడానికి తగిన సమయం లభించకపోవచ్చు. సిప్‌లో అలా కాకుండా అధిక సమయానికి పెట్టుబడి పెడుతున్నందువల్ల వృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతా: తక్కువ రిస్క్‌తో కచ్చితమైన వడ్డీని అందించేది పబ్లిక్ ప్రావిడెంట్‌ ఖాతా. దాదాపు 7 శాతంపైనే వడ్డీ ఉంటుంది. అంతేకాదు దీనిపై వచ్చే ఆదాయంపై ఎటువంటి వడ్డీ ఉండదు. సేవింగ్స్‌పై పన్నుల భారాన్ని తగ్గించుకుందామనుకొనే వారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది. 15ఏళ్ల మెచ్యూరిటీ దాటిన తర్వాత కూడా 5ఏళ్ల చొప్పున పెట్టుబడిని పొడిగించుకోవచ్చు. రూ.16లక్షల మెచ్యూరిటీ కోసం మీరు రోజుకు రూ.167 అంటే నెలకు రూ.5000 పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా మీ PPF ఖాతాలో రూ.5,000 డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాల మెచ్యూరిటీతో మీరు రూ.16 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తారు.

పోస్టాఫీసు పథకాలు: పోస్టాఫీసు స్కీంలు మధ్యతరగతి ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉంటాయి. మంచి రాబ‌డిని అందిస్తాయి. అంతేకాక మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్‌, మంత్‌లీ ఇన్‌కమ్‌ స్కీం, పొదుపు ఖాతా, టైం డిపాజిట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అంటూ చాలా స్కీంలు ఉన్నాయి. ఇవన్ని సురక్షితమైన పెట్టుబడులు. ఇందులో ఏదో ఒకదానిలో పెట్టుబడి పెట్టడం మంచిది.

టర్మ్ ఇన్సూరెన్స్‌: ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోయినప్పుడు అతడి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించేదే టెర్మ్ ఇన్సూరెన్స్‌. సేవింగ్స్‌తో నిమిత్తం లేకుండా మరణాంతరం నామినీకి డబ్బు అందేలా ఏర్పాటు చేయాలనుకుంటే ఇది మంచి ఎంపిక అవుతుంది. చిన్న వయసులోనే టెర్మ్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే పెద్ద మొత్తానికి కవరేజీ పొందవచ్చు.

Tags:    

Similar News