Business Idea: మీరు మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారా.. సులువుగా రూ.5 లక్షలు పొందుతారు..!

Business Idea: కేంద్ర ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడానికి అనేక పథకాల ను ప్రవేశపెడుతోంది.

Update: 2024-05-06 10:42 GMT

Dwcra Women : డ్వాక్రా మహిళలకు శుభవార్త..రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

Business Idea: కేంద్ర ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడానికి అనేక పథకాల ను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా డ్వాక్రా గ్రూప్‌లో సభ్యులుగా ఉన్న మహిళల కోసం లక్‌పతి దీదీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద సున్నా వడ్డీకే రూ.5 లక్షల వరకు లోన్‌ మంజూరు చేస్తారు. అంతేకాకుండా మీకు నచ్చిన ఉపాధిలో శిక్షణ ఇచ్చి బిజినెస్‌ స్టార్ట్‌ చేపిస్తా రు. కానీ ఈ స్కీం గురించి చాలామందికి తెలియదు. ఈ రోజు ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి. అర్హులు ఎవరు.. తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా 2023లో కేంద్రం లక్‌ పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దీనిని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2024-25 ఇంటరిమ్ బడ్జెట్లో దాదాపు 3కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చాలని నిర్దేశించారు.

లక్ పతీ దీదీ పథకానికి అర్హతలు..

ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్దేశించిన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. దరఖాస్తునకు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఎస్‌హెచ్‌జీ సభ్యత్వ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అవసరం అవుతాయి.

వీటిని సిద్ధం చేసుకున్నాక మీ జిల్లలోని మహిళా శిశు అభివృద్ధి శాఖకార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లక్ పతీ దీదీ పథకం గురించి దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. ఆ ఫారమ్ తీసుకొని అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత పైనే పేర్కొన్న డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలి. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలుంటే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.

అవసరమైన శిక్షణ ఇస్తారు

ఈ పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకుంటే అది మంజూరైన తర్వాత వ్యాపారానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్ లైన్ వ్యాపారం, బిజినెస్ సంబంధించిన శిక్షణను అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తారు.

Tags:    

Similar News