Ration Card: అలర్ట్.. కొత్త రేషన్‌కార్డు కోసం ఈ పథకం కింద అప్లై చేసుకోండి..!
Ration Card: మీరు కొత్త రేషన్ కార్డును పొందాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
Ration Card: మీరు కొత్త రేషన్ కార్డును పొందాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మేరా రేషన్ మేరా అధికార్ కార్యక్రమం కింద నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వం ఆగస్టు 5న ప్రారంభించింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 11 రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రారంభించింది. ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత దాదాపు 13,000 మంది ఇందులో పేర్లని నమోదు చేసుకున్నారు. నిరాశ్రయులైన ప్రజలు, నిరుపేదలు, వలసదారులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులను త్వరగా గుర్తించడమే ఉమ్మడి రిజిస్ట్రేషన్ ఉద్దేశ్యమని DFPD సెక్రటరీ సుధాన్షు పాండే చెప్పారు. ఈ కార్యక్రమంలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని చేర్చే పరిశీలనలో ఉన్నారు. చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లతో కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కవరేజీని అందిస్తారు. ఈ రాష్ట్రాల్లో ఉమ్మడి రిజిస్ట్రేషన్ సౌకర్యం కోసం సన్నాహాలని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి.
ఈ కార్యక్రమం ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో ప్రారంభమైంది. NFSA కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యం కోసం సెక్రటరీ (DFPD) 5 ఆగస్టు 2022న 11 రాష్ట్రాలు అస్సాం, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు వెబ్ ఆధారిత రిజిస్ట్రేషన్ సౌకర్యం (మేరా రేషన్ మేరా అధికార్) ప్రారంభించారు. ఈ సదుపాయం https://nfsa.gov.inలో అందుబాటులో ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) దేశవ్యాప్తంగా దాదాపు 81.35 కోట్ల మందికి గరిష్ట కవరేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం దాదాపు 79.77 కోట్ల మంది ప్రజలు సబ్సిడీపై ఆహార ధాన్యాలను పొందుతున్నారు.