Indian Railway: రైల్వే మరొక నిర్ణయం.. మహిళల భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు..!

Indian Railway: రైలులో ప్రయాణించే మహిళల కోసం రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలని జారీ చేసింది.

Update: 2022-12-29 05:47 GMT

Indian Railway: రైల్వే మరొక నిర్ణయం.. మహిళల భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు..!

Indian Railway: రైలులో ప్రయాణించే మహిళల కోసం రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలని జారీ చేసింది. వీటి వల్ల మహిళలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లతో సహా అనేక తరగతుల కోసం రైల్వే కొత్త నియమాలని రూపొందించింది. మహిళలపై నేరాలను నిరోధించేందుకు రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూనే ఉంది. గత ఏడాది కాలంలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన డేటాబేస్ రూపొందించాలని రైల్వేశాఖ అధికారులని ఆదేశించింది.

మహిళా కోచ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలని రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌ని అలర్ట్ చేసింది. దీంతో పాటు ఇతర కోచ్‌లలో ప్రయాణించే మహిళల భద్రతపై కూడా పూర్తి దృష్టి సారించాలని సూచించింది. అనుమానితులపై నిఘా ఉంచడంతోపాటు సున్నిత ప్రాంతాలను తరచుగా సందర్శించాలని తెలిపింది. గుర్తింపు లేకుండా ఎవ్వరిని రైల్వే ప్రాంగణాలకు వెళ్లడానికి అనుమతించకూడదు. దీంతో పాటు ఉచిత వైఫై ఇంటర్నెట్ సేవల ద్వారా పోర్న్ చూస్తున్న వారిపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

CCTV ఫీడింగ్‌ పరిశీలన

రైల్వే స్టేషన్‌ల యార్డులు లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో గుబురుగా ఉన్న చెట్లు లేకుండా చూసుకోవాలని తెలిపింది. వీటివల్ల అసాంఘీక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయని వీటిని గమనించాలని రైల్వే అధికారులకి సూచించింది. అంతే కాకుండా కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ ఫీడింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తప్పుడు పనులు చేసే ఉద్యోగులపై సీరియస్‌ యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది.

Tags:    

Similar News