పీఎన్‌బీ కస్టమర్లకి అలర్ట్‌.. ఆగస్ట్‌ 31లోపు ఇది చేయకపోతే అంతే సంగతులు..!

PNB Customers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.

Update: 2022-08-20 16:15 GMT

పీఎన్‌బీ కస్టమర్లకి అలర్ట్‌.. ఆగస్ట్‌ 31లోపు ఇది చేయకపోతే అంతే సంగతులు..!

PNB Customers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఇంకా KYC చేయకపోతే వెంటనే చేయండి. ఎందుకంటే బ్యాంక్ కస్టమర్‌లకు 31 ఆగస్టు 2022లోపు KYCని పూర్తి చేయాలని ట్వీట్ చేసింది. గత కొన్ని నెలలుగా KYCని అప్‌డేట్ చేయమని బ్యాంక్ తన కస్టమర్‌లకు విజ్ఞప్తి చేస్తోంది. KYC పూర్తి చేయడం ద్వారా కస్టమర్ల బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది లేదంటే ఖాతాదారులు నిధులను బదిలీ చేయలేరు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేస్తూ "RBI మార్గదర్శకాల ప్రకారం KYC అప్‌డేట్‌ అనేది కస్టమర్లందరికీ తప్పనిసరి. 31.03.2022 నాటికి మీ ఖాతా KYC అప్‌డేట్ కోసం పెండింగ్‌లో ఉంటే 31.08.2022లోపు KYCని అప్‌డేట్ చేయడానికి మీ సొంత బ్రాంచ్‌కి వెళ్లాలి. లేదంటే మీ ఖాతా లావాదేవీలపై నిషేధం విధించడం" జరుగుతుంది.

KYC అంటే ఏమిటీ..?

వాస్తవానికి KYC అనేది కస్టమర్ గురించి సమాచారాన్ని అందించే పత్రం. బ్యాంకింగ్ రంగంలో ప్రతి 6 నెలలు లేదా 1 సంవత్సరానికి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి KYC ఫారమ్‌ను కోరుతుంది. ఈ KYC ఫారమ్‌లో మీరు మీ పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, పూర్తి చిరునామాను అందించాలి. ఈ విధంగా కస్టమర్ మొత్తం సమాచారాన్ని బ్యాంకుకి అందించాలి.

అయితే KYC చేయడం చాలా సులభం. మీరు ఇంట్లో కూర్చొని సులభంగా చేయవచ్చు. మీరు బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాలనుకుంటే అలా కూడా చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు మీ అకౌంట్‌ ఉన్న బ్యాంకుకి వెళ్లి సంబంధిత డెస్క్ నుంచి KYC ఫారమ్‌ను తీసుకొని ఫారమ్‌ను పూరించి అందులో అవసరమైన అన్ని పత్రాలను జత చేసి సమర్పిస్తే సరిపోతుంది. KYC ఫారమ్‌ను సమర్పించిన 3 రోజులలోపు మీ KYC అప్‌డేట్‌ అవుతుంది.

Tags:    

Similar News