EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. కొత్త మనీ విత్‌ డ్రా రూల్స్‌ తెలుసుకోండి..!

EPFO Alert: ప్రావిడెంట్ ఫండ్ (PF ) అనేది కాంట్రిబ్యూషన్ ఆధారిత పొదుపు పథకం.

Update: 2023-04-01 10:30 GMT

EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. కొత్త మనీ విత్‌ డ్రా రూల్స్‌ తెలుసుకోండి..!

EPFO Alert: ప్రావిడెంట్ ఫండ్ (PF ) అనేది కాంట్రిబ్యూషన్ ఆధారిత పొదుపు పథకం. ఇక్కడ ఉద్యోగి, యజమాని ఇద్దరూ రిటైర్మెంట్‌ అనంతర అవసరాలను తీర్చడానికి ఒక ఫండ్‌ను నిర్మించడానికి సహకరిస్తారు. అయితే ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ మనీ విత్‌ డ్రా కొన్ని నిబంధనలకు లోబడి చేయవచ్చు. ఎవరైనా పాన్‌ కార్డ్ లేకుండా ఈపీఎఫ్‌వో నుంచి డబ్బును విత్‌డ్రా చేయాలంటే 30% TDS చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దానిని 20 శాతానికి తగ్గించారు. ఈ నియమం 1 ఏప్రిల్ 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ విత్‌ డ్రా నియమాల గురించి తెలుసుకుందాం.

నిరుద్యోగం విషయంలో

ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక నెల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నట్లయితే సదరు నిరుద్యోగి పీఎఫ్‌ మొత్తంలో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ నిబంధన రెండు నెలలు దాటితే ఖాతాదారుడు మిగిలిన 25 శాతాన్ని కూడా విత్‌ డ్రా చేసుకోవచ్చు.

విద్య కోసం

పీఎఫ్‌ ఖాతాదారులు ఉన్నత విద్య కోసం, 10వ తరగతి తర్వాత వారి పిల్లల చదువు కోసం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్‌ ఖాతాకు కనీసం 7 సంవత్సరాలు కంట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే నిధులను బదిలీ చేయవచ్చు.

వివాహం కోసం

తాజా పీఎఫ్‌ నిబంధనలు వివాహా ఖర్చుల కోసం ఉద్యోగి వాటాలో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తాయి. అయితే సంబంధిత వ్యక్తి లేదా ఖాతాదారుని కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి అయి ఉండాలి. 7 సంవత్సరాల పీఎఫ్‌ సహకారం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ నిబంధనను ఉపయోగించవచ్చు.

దివ్యాంగులు

2023 పీఎఫ్‌ నియమాల కింద దివ్యాంగులు డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు 6 నెలల బేసిక్ జీతాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. దివ్యాంగా ఖాతాదారుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ

పీఎఫ్‌ ఖాతాదారుడు కొన్ని వ్యాధుల తక్షణ చికిత్స కోసం కొంత మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. 6 నెలల బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్ లేదా వడ్డీతో పాటు ఉద్యోగి వాటా, ఏది తక్కువైతే అది విత్‌ డ్రా చేసుకోవచ్చు.

అప్పు చెల్లించడానికి

వ్యక్తులు తమ గృహ రుణ ఈఎంఐ చెల్లించడానికి 36 నెలల ప్రాథమిక జీతం + డియర్‌నెస్ అలవెన్స్ లేదా వడ్డీతో పాటు మొత్తం ఉద్యోగి, యజమాని వాటాను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ఈపీఎఫ్‌ ఖాతాకు కనీసం 10 సంవత్సరాల కంట్రిబ్యూషన్ తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News