Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. దీపావళికి ముందు శుభవార్త..!
Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు తీపి కబురు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరువు భత్యాన్ని పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు తీపి కబురు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరువు భత్యాన్ని పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈసారి డీఏలో మూడు శాతం పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇందులో 3 శాతం పెరిగితే 45 శాతానికి చేరుతుంది. దీంతో పాటు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలో డీఏ పెంపు గురించి ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు కొంత ఆర్థిక భారం తప్పుతుంది.
ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం నాలుగు శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తే కేంద్ర ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుంది. సాధారణ ఉద్యోగి ప్రతి నెలా రూ.36,500 బేసిక్ వేతనం అందుకుంటే ప్రస్తుతం డీఏ రూ.15,330. ఇప్పుడు మూడు శాతం పెంచితే రూ.1,095 పెరిగి రూ.16,425కి చేరుతుంది. దీంతో జూలై నుంచి బకాయిలు కూడా అందుతాయి. దీనివల్ల ఉద్యోగుల జీతంలో కొన్ని మార్పులు ఏర్పడవచ్చు.
కరోనా కాలంలో 18 నెలల పాటు అంటే జనవరి 1, 2020, జూన్ 30, 2021 మధ్య కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు DA చెల్లించలేదు. అదేవిధంగా పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ DR చెల్లించలేదు. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఇలా చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.34,402.32 కోట్లు ఆదా అయ్యాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీపావళికి ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.