SBI Balance: ఎస్బీఐ కస్టమర్లకి గమనిక.. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ సులభంగా చెక్ చేయండి..!

SBI Balance: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది.

Update: 2022-06-26 09:30 GMT

SBI Balance: ఎస్బీఐ కస్టమర్లకి గమనిక.. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ సులభంగా చెక్ చేయండి..!

SBI Balance: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా 45 కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉంది. ఖాతాదారులకు అనేక రకాల డిజిటల్ సౌకర్యాలను అందిస్తుంది. ఒకప్పుడు ప్రజలు తమ ఖాతా బ్యాలెన్స్‌ను చూసుకోవడానికి బ్యాంకులో లైన్లలో నిలబడవలసి వచ్చేది. అంతేకాదు పాస్‌బుక్‌ ప్రింట్‌ చేయించుకుని ఖాతాలో జమ అయిన సొమ్ముకు సంబంధించిన సమాచారాన్నిపొందేవారు. కానీ పెరుగుతున్న డిజిటల్ యుగంలో ప్రజలు బ్రాంచ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. నాలుగు పద్దతుల ద్వారా ఖాతాలో ఉన్న డబ్బు గురించి సులభంగా తెలుసుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటే ఖాతాలో జమ అయిన డబ్బు గురించి సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. చేయాల్సిందల్లా నెట్ బ్యాంకింగ్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. దీంతో పాటు ఫండ్ బదిలీ, వ్యక్తిగత రుణం, గృహ రుణం మొదలైన ఇతర ఉత్పత్తుల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ఎస్బీఐ యోనో

ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఎస్బీఐ యోనో యాప్‌ ద్వారా మీరు ఖాతాలో జమ అయిన డబ్బు గురించి సమాచారం సులభంగా పొందవచ్చు. మీరు యాప్ ద్వారా ఈ-పాస్‌బుక్‌ని రూపొందించవచ్చు. తర్వాత మీరు బ్యాలెన్స్ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

ఎటీఎం

మీరు ఎస్బీఐ ఏటీఎం మెషీన్ ద్వారా బ్యాలెన్స్‌ తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం మీరు డెబిట్ కార్డును ఏటీఎం మెషీన్‌లో స్వైప్ చేయండి. తర్వాత 4 నంబర్ల ఏటీఎం పిన్‌ను ఎంటర్ చేయండి. తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా బ్యాలెన్స్ తెలుస్తుంది.

టోల్ ఫ్రీ నంబర్

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ 09223866666కు కాల్ చేయడం ద్వారా మీ ఖాతా సమాచారాన్ని, బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News