Women Alert: మహిళలకు అలర్ట్.. చిన్న చిన్న పొదుపుతో లక్షలు సంపాదించే స్కీమ్స్ ఇవే..!
Women Alert: మహిళలు, గృహిణులు ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించే బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి. కానీ ఇవి చాలా మందికి తెలియవు.
Women Alert: మహిళలు, గృహిణులు ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించే బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి. కానీ ఇవి చాలా మందికి తెలియవు. చిన్న చిన్న పొదుపులతో లక్షల రూపాయలు కూడబెట్టవచ్చు.కేవలం 500 లేదా 1000 రూపాయలతో మొదలయ్యే అనేక పథకాలు ఉన్నాయి. క్రమశిక్షణతో పొదుపు చేస్తుంటే కొంతకాలానికి పెద్ద ఫండ్ తయారవుతుంది. ఈ స్కీమ్‌లన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవే కాబట్టి మీ డబ్బుకి భద్రత కూడా లభిస్తుంది. అలాంటి కొన్ని స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
RD పెట్టుబడి
పోస్టాఫీసులో చిన్న చిన్న స్కీమ్‌లు చాలా ఉంటాయి. అందులో ఒకటి RD (రికరింగ్ డిపాజిట్). ఇందులో నెలకు రూ.1000 చొప్పున 5 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే దాదాపు రూ.60.000 వేలు పెట్టుబడి పెడుతారు. కానీ మెచ్యూరిటీ సమయంలో రూ.70,989 పొందవచ్చు. ఈ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు అవసరమైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మొత్తంతో ఊహించినదానికంటే ఎక్కువ సంపాదించవచ్చు.
ముద్ర రుణాలు
కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ముద్ర రుణాలు అందిస్తోంది. వీటి ద్వారా రూ.50 వేల నుంచి దాదాపు పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. వీటితో ఏదైన చిన్నపాటి బిజినెస్ ప్రారంభించవచ్చు. ఎవరి దగ్గర పనిచేయకుండా సొంతంగా ఉపాధి పొందవచ్చు.
పీపీఎఫ్ స్కీం
PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనిష్టంగా రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. 15 ఏళ్లపాటు నిరంతరంగా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత వడ్డీతో సహా పెద్ద మొత్తాన్ని పొందుతారు. నెలకు రూ.1000 చొప్పున 15 ఏళ్లపాటు డిపాజిట్ చేస్తే ఏడాదిలో రూ.12 వేలు, 15 ఏళ్లలో రూ.1,80,000 జమ చేస్తారు. దీనిపై వడ్డీగా రూ.1,45,457 పొందుతారు మెచ్యూరిటీపై మొత్తం రూ.3,25,457 అవుతుంది. నెలా నెలా పొదుపు చేస్తూ మరిచిపోతే కొంత కాలానికి పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది.
సిప్‌లో పెట్టుబడి
మహిళలు కావాలంటే SIPలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ పద్దతి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో తక్కువలో తక్కవగా 12 శాతం వడ్డీని పొందుతారు. ఇందులో కూడా నెలా నెలా రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ. 1,80,000 పెట్టుబడి పెడతారు. కానీ 12 శాతం వడ్డీకి రూ.3,24,576 పొందుతారు. 15 ఏళ్లలో రూ.5,04,576 పొందుతారు. ఒకవేళ వడ్డీ ఎక్కువగా వస్తే ఇంకా ఎక్కువ మొత్తం లభిస్తుంది.