SBI: ఎస్బీఐ కస్టమర్లకి అలర్ట్.. గడువు దగ్గర పడుతోంది..!
SBI: ఎస్బీఐ కస్టమర్లకి అలర్ట్.. గడువు దగ్గర పడుతోంది..!
SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తుంది. 31 మార్చి 2022లోపు పాన్-ఆధార్ కార్డ్‌ని లింక్ చేయాలని బ్యాంక్ తన ఖాతాదారులకు నోటీసు ఇచ్చింది. ఖాతాదారులు ఇలా చేయకపోతే వారి బ్యాంకింగ్ సేవలను నిలిపివేయవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ కూడా చేసింది.
SBI ట్వీట్ చేస్తూ..'ఖాతాదారులు మెరుగైన బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. PAN, ఆధార్ లింక్ చేయకపోతే PAN నిష్క్రియం అవుతుంది. నిర్దిష్ట లావాదేవీలను నిర్వహించడానికి PAN ఉపయోగంలో ఉండదు' అని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు 30 సెప్టెంబర్ 2021 నుంచి 31 మార్చి 2022 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.పాన్-ఆధార్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి
1. ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
https://www.incometaxindiaefiling.gov.in/home
2. ఇక్కడ ఎడమ వైపున మీకు లింక్ ఆధార్ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఆధార్ 4లో పేర్కొన్న విధంగా పాన్, ఆధార్, మీ పేరును ఎంటర్ చేయాలి.
4. మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే ఆపై 'ఆధార్ కార్డ్‌లో నాకు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది' అనే బాక్స్‌ని టిక్ చేయాలి.
5. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి OTP కోసం అభ్యర్థించండి.
6. తర్వాత ఓటిపీ నెంబర్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ బటన్‌పై క్లిక్ చేయండి. అంతే పాన్, ఆధార్ లింక్ అయినట్లు మీ మొబైల్‌కి మెస్సేజ్ వస్తుంది.