EPFO: పీఎఫ్‌ అలర్ట్‌.. ఇప్పుడు నెలవారీ పెన్షన్ పెరిగే అవకాశాలు..!

EPFO: మీరు ఉద్యోగం చేస్తూ మీ జీతం నుంచి ఈ పీఎఫ్‌ కట్‌ అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Update: 2022-12-21 12:30 GMT

EPFO: పీఎఫ్‌ అలర్ట్‌.. ఇప్పుడు నెలవారీ పెన్షన్ పెరిగే అవకాశాలు..!

EPFO: మీరు ఉద్యోగం చేస్తూ మీ జీతం నుంచి ఈ పీఎఫ్‌ కట్‌ అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వేతనాలు పొందుతున్న వారికి ఈపీఎస్‌ కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని 'ఈపీఎస్-95 రాష్ట్రీయ సంఘర్ష్ సమితి' కార్మిక మంత్రిత్వ శాఖకు 15 రోజుల నోటీసు ఇచ్చింది. డిమాండ్‌ను నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని నోటీసులో పేర్కొంది.

పెన్షనర్ల వైద్య సదుపాయాలు

ఈపీఎస్-95 పెన్షనర్ల పెన్షన్ చాలా తక్కువగా ఉందని సంఘర్ష్ సమితి.. కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. దీంతోపాటు వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పింఛనుదారుల మరణాల రేటు పెరుగుతోంది. 15 రోజుల్లోగా ఈ పింఛను పెంపుదల ప్రకటించకుంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని లేఖలో పేర్కొన్నారు.

ఇందులోభాగంగా రైలు, రోడ్డు రవాణాను నిలిపివేస్తామని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని నిర్ణీత వ్యవధిలో డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రకటించాలని కమిటీ డిమాండ్ చేసింది. దీంతో పాటు అక్టోబర్ 4, 2016, నవంబర్ 4, 2022 న సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కమిటీ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News