EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్‌.. ఇదొక్కటి చేయకుంటే 7 లక్షలు కోల్పోయినట్లే..!

EPFO Alert: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం జరగదు.

Update: 2022-12-19 09:05 GMT

EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్‌.. ఇదొక్కటి చేయకుంటే 7 లక్షలు కోల్పోయినట్లే..!

EPFO Alert: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం జరగదు. ఖాతాదారులందరికి వారి వారి ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. కానీ కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా పాస్‌బుక్‌లో కనిపించదు. వాస్తవానికి ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకి ఈ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇది చేయకుంటే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలేరు. ఈ నామినేషన్ వల్ల ఖాతాదారుడి కుటుంబానికి సామాజిక భద్రత లభిస్తుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

ఈ-నామినేషన్ తప్పనిసరి

ఈపీఎఫ్‌వో తన సబ్‌స్క్రైబర్‌లకు నామినీ సమాచారాన్ని తెలియజేయడానికి ఈ-నామినేషన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆ తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ వంటి ఆన్‌లైన్ సమాచారం అప్‌డేట్ అవుతుంది. దీనివల్ల ఖాతాదారుడు మరణించిన సందర్భంలో పీఎఫ్‌, పెన్షన్ (EPS) బీమా (EDLI)కి సంబంధించిన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి నామినీ/కుటుంబ సభ్యులకు ఇది సహాయపడుతుంది.

7 లక్షల రూపాయలు

ఈపీఎఫ్‌వో సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)కింద బీమా రక్షణ సౌకర్యాన్ని పొందుతారు. పథకంలో నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా కవరేజీ అందుతుంది. ఏదైనా నామినేషన్ లేకుండా సభ్యుడు మరణిస్తే దావాను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేయండి. అంతేకాదు ఖాతాదారులు ఒకటి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేయవచ్చు.

Tags:    

Similar News