NPS కస్టమర్లకి అలర్ట్‌.. ఖాతా స్తంభిస్తే టెన్షన్ పడకండి..!

NPS కస్టమర్లకి అలర్ట్‌.. ఖాతా స్తంభిస్తే టెన్షన్ పడకండి..!

Update: 2022-03-21 13:30 GMT

NPS కస్టమర్లకి అలర్ట్‌.. ఖాతా స్తంభిస్తే టెన్షన్ పడకండి..!

NPS: రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒక గొప్ప ఎంపిక. దీంతో పాటు పన్ను ఆదా, రాబడుల విషయంలోనూ అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి మీరు దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటే మంచిది. ఉదాహరణకు మీ NPS ఖాతా తాత్కాలికంగా ఆగిపోతే టెన్షన్ పడకండి. మీరు ఆన్‌లైన్‌లో లేదా బ్యాంక్, పోస్టాఫీసును సందర్శించడం ద్వారా NPS ఖాతాను పునరుద్దరించవచ్చు. కానీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఒక ఫారమ్ నింపాలి   

NPSలో పెట్టుబడి పెట్టడానికి PRAN అంటే శాశ్వత ఖాతా సంఖ్య ఉంటుంది. NPS ఖాతా ఆగిపోయిన తర్వాత UOS-S10A అనే ఫారమ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి తీసుకోవాలి. మీరు ఈ ఫారమ్‌ నింపి బ్యాంకు లేదా పోస్టాఫీసులో సమర్పిస్తే సరిపోతుంది. ఇది కాకుండా మీరు ఆన్‌లైన్‌లో కూడా ఈ ఫారమ్‌ నింపవచ్చు.

12% కంటే ఎక్కువ రాబడిని

ఒక నివేదిక ప్రకారం గత 10 సంవత్సరాలలో NPS సగటు రాబడి 12 శాతానికి పైగా ఇచ్చింది. ఇది కాకుండా సెక్షన్ 80సి కింద పెట్టుబడిపై రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు NPSలో పెట్టుబడిపై రూ. 50,000 అదనపు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితానికి ఎన్‌పీఎస్‌ అత్యుత్తమ ఎంపిక అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ఎంత డిపాజిట్ చేయాలి..?

ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 1000 రూపాయలను ఎన్‌పిఎస్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా ఎన్‌పిఎస్‌లో పెట్టుబడిదారులకు మరో సదుపాయాన్ని కల్పించింది. దీని కింద పెట్టుబడిదారులు ఆర్థిక సంవత్సరంలో వారి సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా NPS ఖాతాలో మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తానికి కనీస పరిమితి, పదవీకాలం ఉండదు. 

Tags:    

Similar News