NPS ఖాతాదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మనీ విత్‌ డ్రాలో మార్పు!

NPS Customers: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఇది పీఎఫ్‌ఆర్‌డీఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద పని చేస్తుంది.

Update: 2024-01-30 11:00 GMT

NPS ఖాతాదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మనీ విత్‌ డ్రాలో మార్పు!

NPS Customers: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఇది పీఎఫ్‌ఆర్‌డీఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద పని చేస్తుంది. అయితే ఎన్‌పీఎస్ ఫిబ్రవరి 1 నుంచి మనీ విత్‌ డ్రా నియమాలను మార్చబోతుంది. ఇప్పుడు ఎన్‌పీఎస్‌ ఖాతాదారులు వచ్చే నెల నుంచి డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఈ పరిస్థితుల్లో విత్‌ డ్రాకు అవకాశం

జనవరి 12, 2024న పెన్షన్ రెగ్యులేటర్ PFRDA జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం NPS ఖాతాదారులు పిల్లల చదువులు, వివాహ ఖర్చులు, ఇల్లు కొనుగోలు, వైద్య ఖర్చులు మొదలైన వాటి కోసం వారి ఖాతాలో జమ చేసిన మొత్తంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేయగలరు. ఇది కాకుండా సొంత వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించడానికి NPS ఖాతా నుంచి విత్‌ డ్రా చేయవచ్చు. ఖాతాదారు, యజమాని ఇద్దరి సహకారం మొత్తం ఇందులో ఉంటుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.

ఈ విధంగా విత్‌డ్రా చేయండి

ఎన్‌పీఎస్‌ ఖాతాదారుడు తన ఖాతా నుంచి మనీ విత్‌ డ్రా చేయాలంటే ముందుగా విత్‌ డ్రా కోసం అప్లికేషన్‌ పెట్టాలి. ఖాతాదారుడు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మాస్టర్ సర్క్యులర్‌లోని పేరా 6(డి) ప్రకారం అతడి కుటుంబ సభ్యుడు కొంత మొత్తం విత్‌ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత CRA (సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ) మీ అభ్యర్థనను పరిశీలిస్తుంది. సమాచారం సరైనదని తేలితే కొద్ది రోజుల్లోనే ఖాతాకు డబ్బు బదిలీ చేస్తారు.

ఈ షరతులు వర్తిస్తాయి

1. NPS ఖాతా నుంచి మనీ విత్‌ డ్రా చేయాలంటే ఖాతా ఓపెన్‌ చేసి కనీసం 3 సంవత్సరాలు అయి ఉండాలి.

2. విత్‌డ్రా చేసే మొత్తంలో నాలుగో వంతు మించకూడదు.

3. ఒక చందాదారుడు ఖాతా నుంచి మూడు సార్లు మాత్రమే విత్‌ డ్రా చేయవచ్చు.

Tags:    

Similar News