ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్.. వారికి పాత పెన్షన్ విధానం.. మీరు అందులో ఉన్నారా..!

Old Pension System: పాత పెన్షన్ విధానంపై ఈ రోజుల్లో బాగా చర్చ నడుస్తోంది.

Update: 2023-03-06 14:30 GMT

ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్.. వారికి పాత పెన్షన్ విధానం.. మీరు అందులో ఉన్నారా..!

Old Pension System: పాత పెన్షన్ విధానంపై ఈ రోజుల్లో బాగా చర్చ నడుస్తోంది. దీనిపై ఇటీవల ఒక అప్‌డేట్‌ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన విషయంలో కొంతమంది ఉద్యోగులని పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి మారడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ స్కీమ్‌కు మారనున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించదు. కొన్ని శాఖల ఉద్యోగులు మాత్రమే ఈ లబ్ధిపొందుతారు.

కొత్త పెన్షన్ పథకం

మీడియా నివేదికల ప్రకారం డిసెంబర్ 22, 2003కి ముందు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది వ్యక్తులు 2004లో ఉద్యోగాలలో చేరారు. వీరు ఓల్డ్‌ పెన్షన్‌ విధానానికి అర్హులు అవుతారు. కానీ వీరు ప్రస్తుతం NPSలో ఉన్నారు. వాస్తవానికి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) 22 డిసెంబర్ 2003న నోటిఫై చేశారు. పరిపాలనా కారణాల వల్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆలస్యం అయినందున 2004లో సర్వీసుల్లో చేరిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) సిబ్బంది, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్‌ కిందికి వస్తారు.

పాత పెన్షన్ విధానం వల్ల చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కానీ దీనిని పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వంపై అనవసరమైన ఆర్థిక భారం పడుతుంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి 31 నాటికి 23,65,693 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60,32,768 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌ కింద నమోదు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు ఎన్‌పిఎస్‌ని అమలు చేశాయి.

Tags:    

Similar News