Salary Account: ఉద్యోగులకి అలర్ట్‌.. సాలరీ అకౌంట్‌తో ఈ ప్రయోజనాలు..!

Salary Account: ఉపాధి కోసం కొందరు ఉద్యోగాలు చేస్తే మరికొంతమంది బిజినెస్‌ చేస్తారు.

Update: 2022-11-01 14:21 GMT

Salary Account: ఉద్యోగులకి అలర్ట్‌.. సాలరీ అకౌంట్‌తో ఈ ప్రయోజనాలు..!

Salary Account: ఉపాధి కోసం కొందరు ఉద్యోగాలు చేస్తే మరికొంతమంది బిజినెస్‌ చేస్తారు. అయితే చాలామంది ఉద్యోగాలకే మొగ్గుచూపుతారు. అయితే వీరికి చెల్లించే సాలరీ బ్యాంకు అకౌంట్‌లో జమవుతుంది. ఇందుకోసం కొంతమంది సాలరీ అకౌంట్‌ తీసుకుంటే మరికొంతమంది పొదుపు ఖాతా తెరుస్తారు. అయితే సాలరీ అకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఉచిత లావాదేవీలు

సాలరీ అకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే ఉచిత లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగుల అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్‌లు ఈ ఖాతాలో జమ అవుతాయి.

జీరో బ్యాలెన్స్ ఖాతా

సాలరీ అకౌంట్‌ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌. ఇలాంటి అకౌంట్లకి బ్యాంకు ఎటువంటి ఛార్జీలని వసూలు చేయదు. కానీ సాధారణ పొదుపు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్ మెయింటెన్‌ చేయడం అవసరం. లేదంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత ATM లావాదేవీలు

సాలరీ అకౌంట్‌తో లింక్‌ అయిన చాలా బ్యాంకులు అపరిమిత లావాదేవీలను అందిస్తాయి. అంటే నెలలో ఎన్నిసార్లు అయినా ATM లావాదేవీలు చేసుకోవచ్చు. పెనాల్టీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లాకర్ ఛార్జీలపై తగ్గింపు

చాలా బ్యాంకులు సాలరీ అకౌంట్లపై లాకర్ ఛార్జీలను మాఫీ చేస్తాయి. SBIలో లాకర్ ఛార్జీలపై 25 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

ఇతర సౌకర్యాలు

సాలరీ అకౌంట్‌తో పాటు చాలా బ్యాంకులు డీమ్యాట్ ఖాతా, రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డ్ మొదలైన సౌకర్యాలను అందిస్తాయి. మీరు చెక్ బుక్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇతర సౌకర్యాలు కూడా పొందుతారు.

Tags:    

Similar News