దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలబాట
* ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు జోష్ * బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్లు మేర అప్ * 14,700 పాయింట్ల ఎగువకు నిఫ్టీ 50
దేశీ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాల బాట పట్టాయి ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వంద పాయింట్లు మేర జంప్ చేయగా నిఫ్టీ 50 సైతం 14,700 పాయింట్ల ఎగువకు చేరింది. ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న కేంద్ర బడ్జెట్‌కు మార్కెట్ వర్గాలు సాదర స్వాగతం పలికిన నేపధ్యంలో మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది ప్రస్తుతం సెన్సెక్స్ 175 పాయింట్లు ఎగసి 49,973 వద్దకు చేరగా , నిఫ్టీ 59 పాయింట్ల మేర లాభంతో 14,707 వద్ద కదలాడుతున్నాయి.
దేశీ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం హై రికార్డులను నమోదు చేశాయి.మిడ్ సెషన్ సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 50 వేల పాయింట్ల మైలు రాయిని దాటగా నిఫ్టీ సైతం తొలిసారిగా 14,800 పాయింట్ల ఎగువకు చేరింది ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న కేంద్ర బడ్జెట్‌కు మార్కెట్ వర్గాలు స్వాగతం పలికిన నేపధ్యంలో మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది ప్రస్తుతం సెన్సెక్స్ 572 పాయింట్లు ఎగసి 50,370 వద్దకు చేరగా , నిఫ్టీ 180 పాయింట్ల మేర లాభంతో 14,828 వద్ద కదలాడుతున్నాయి.