Gold Rate: దేశీయ మార్కెట్లో మరింత తగ్గిన బంగారం ధరలు

Gold Rate: 22 క్యారెట్ల బంగారం పది గ్రా. ధర 47 రూపాయలు డౌన్ * ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రా. రూ. 43,950

Update: 2021-03-05 05:36 GMT

గోల్డ్ (ఫైల్ ఫోటో)

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు వారాంతాన స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 రూపాయలు మేర స్వల్పంగా తగ్గి 43,900 రూపాయలుగా నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,250 రూపాయల నుండి 43,950 రూపాయలకు పడిపోయింది, ఆర్దిక రాజధాని ముంబైలో 43,900 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ - ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ ధర 0.4 శాతం మేర తగ్గి 10 గ్రాములకు 44,768 రూపాయల వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 43,890 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45,850 రూపాయల వద్దకు చేరింది.

Tags:    

Similar News