Aadhaar Card: ఆధార్ కార్డుదారులకి అలర్ట్.. ఓటీపీ విషయంలో జాగ్రత్త..!
Aadhaar Card: ప్రస్తుతం అందరికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారింది.
Aadhaar Card: ప్రస్తుతం అందరికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. గుర్తింపు కార్డుతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పనుల్లో అత్యవసరంగా మారుతోంది. ఇది వ్యక్తిగత వివరాలే కాకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్‌కార్డుకు ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగ ప్రమాదం కూడా పెరుగుతోంది.
చాలా చోట్ల ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. తర్వాత మాత్రమే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. OTP చాలా ముఖ్యమైనది దీన్ని అందరితో షేర్ చేసుకోవద్దు. చిన్న అజాగ్రత్త పెద్ద సమస్యకి దారితీస్తుంది. మీరు ఆధార్‌ని ఉపయోగిస్తున్నప్పుడు OTP రాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఆధార్ కార్డ్ తనిఖీ
1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. తర్వాత ఆధార్ సేవలకు వెళ్లి ఆధార్ హిస్టరీని ఎంచుకోండి.
2. తర్వాత ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు డ్రాప్-డౌన్ మెను నుంచి జనరేట్ OTPని ఎంచుకోవాలి.
3. OTPని నమోదు చేసిన తర్వాత మీరు ఆధార్ హిస్టరీని చూస్తారు.
4. మీ ఫోన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లయితే మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుందని గుర్తుంచుకోండి.
5. ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతోందని భావిస్తే మీ ఫోన్ నంబర్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు UIDAI అత్యవసర హాట్‌లైన్ 1947కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సహాయం కోసం మీరు help@uidai.gov.inని కూడా సంప్రదించవచ్చు.