Senior Citizen: సీనియర్ సిటజన్లకి పెద్ద బహుమతి.. ఈ బ్యాంకులో ఖాతా ఉంటే 2 లక్షల ప్రయోజనం..!
* కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు రూ.2 లక్షల బెనిఫిట్ ఇస్తోంది.
Senior Citizen: బ్యాంకులు సీనియర్ సిటిజన్లకి అనేక సౌకర్యాలని అందిస్తాయి. ముఖ్యంగా బ్యాంక్ ఎఫ్‌డిపై అధిక వడ్డీని చెల్లిస్తాయి. అలాగే ఈ రోజు రూ. 2 లక్షల ప్రయోజనం పొందే పథకం గురించి తెలుసుకుందాం. కానీ సీనియర్ సిటిజన్లు మాత్రమే వర్తిస్తుంది. కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు రూ.2 లక్షల బెనిఫిట్ ఇస్తోంది. జీవంధర పొదుపు ఖాతా ద్వారా వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ఖాతా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది.
జీరో బ్యాలెన్స్
బ్యాంక్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు మాత్రమే ఈ ఖాతాను తెరవగలరు. ఖాతా తెరిచే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీరు జీరో బ్యాలెన్స్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలో నెలకు సగటున రూ. 1700 వార్షిక బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం అవసరం. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ప్రతి సంవత్సరం 2.9 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఖాతాదారుడు ఉచిత డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా పొందుతాడు.
2 లక్షల ప్రయోజనం
కెనరా బ్యాంక్ పెన్షన్ ఖాతాదారులకు రుణ సదుపాయాన్ని అందిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కెనరా పెన్షన్ ప్రోడక్ట్ కింద నెలవారీ పెన్షన్‌కు 10 రెట్లు వరకు రుణం తీసుకోవచ్చు. లేదా గరిష్టంగా రూ. 2 లక్షల రుణం తీసుకోవచ్చు. ఎవరైనా ఖాతాదారుడు పెన్షన్ ఖాతాను మెయింటెన్ చేస్తే అతనికి రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. ఇది కాకుండా MS హెచ్చరికలు, ఇంటర్‌బ్యాంక్ మొబైల్ చెల్లింపు, నెట్ బ్యాంకింగ్, నెలకు రెండు NEFT/RTGS సేవలు ఉచితం. అంతే కాకుండా చెక్ బుక్ కూడా ఉచితంగా లభిస్తుంది.