ప్రతినెలా 3000 పెన్షన్.. కానీ ఇది వారికి మాత్రమే..!
NPS Traders Scheme: చిన్న వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి.
NPS Traders Scheme: చిన్న వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ప్రభుత్వం వీరికి నెల నెల రూ.3000 పెన్సన్ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ NPS వ్యాపారుల పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దీనిని ఈ శ్రమ్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఇది ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ ఇందులో వృద్ధులకు సామాజిక భద్రతతో పాటు పెన్షన్ ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. అయితే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మొదటి నిబంధన ఏంటంటే ఒక వ్యక్తి 18-40 సంవత్సరాల వయస్సు ఉండి NPS ట్రేడర్స్ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలి. రెండో నిబంధన దరఖాస్తుదారు వార్షిక ఆదాయం 1.5 కోట్లకు మించకూడదు. ఈ పథకంలో చేరాలనుకునే దరఖాస్తుదారు NPS, ESIC లేదా EPFO సభ్యుడు కాకూడదు. అలాగే దరఖాస్తుదారు ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు కాకూడదు. ఇందులో లేని వ్యక్తులందరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3000 పింఛను అందజేస్తారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. ఈ పథకంలో దరఖాస్తుదారు ప్రతి నెలా కొంత రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లబ్ధిదారులకు తన తరపున కొంత మొత్తాన్ని కలపడం ద్వారా రూ.3000 పెన్షన్ అందిస్తుంది. పథకంలో చేరిన వ్యక్తులు ప్రతి నెలా 55 నుంచి 200 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎల్ఐసీ మాదిరిగానే ఆ వ్యక్తికి పింఛను అందజేస్తారు. పథకం గురించి మరింత సమాచారం కోసం మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800 267 6888కి కాల్ చేయవచ్చు.