LIC Unclaimed Amount: ఎల్‌ఐసీ అన్ క్లెయిమ్ అమౌంట్ 20 వేల కోట్లు.. హక్కుదారు ఎవరు లేరు..?
LIC Unclaimed Amount: ఎల్‌ఐసీ అన్ క్లెయిమ్ అమౌంట్ 20 వేల కోట్లు.. హక్కుదారు ఎవరు లేరు..?
LIC Unclaimed Amount: ఎల్‌ఐసీ దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ. ఇప్పుడు ఐపీఓ కూడా తీసుకొస్తుంది. దాదాపు మార్చి చివరినాటికి మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే SEBIకి LICసమర్పించిన వివరాల ప్రకారం.. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీకి క్లెయింట్లు లేని అమౌంట్ రూ.21,539.5 కోట్ల మొత్తంగా ఉంది. ఇది చాలా పెద్ద అమౌంట్. చాలా పెద్ద కంపెనీల విలువతో సమానం. బిజినెస్ స్టాండర్డ్‌లోని నివేదిక ప్రకారం.. ఈ అన్‌క్లెయిమ్ చేయని మొత్తంలో చెల్లించని క్లెయిమ్‌లు ఉన్నాయి. వాపసు చేయవలసిన అదనపు చెల్లింపు మొత్తాలు కూడా ఉన్నాయి. పాలసీ మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడిదారుడికి డబ్బు అందలేదు. ఈ మొత్తం రూ.19,285.6 కోట్లు లేదా క్లెయిమ్ చేయని మొత్తంలో దాదాపు 90 శాతం. మార్చి 2021నుంచి ఆరు నెలల్లో మొత్తం అన్‌క్లెయిమ్ చేయని మొత్తం 16.5 శాతం పెరిగింది.
5 కంపెనీల మార్కెట్ క్యాప్
ఈ మొత్తం పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే LIC అన్‌క్లెయిమ్ చేయని మొత్తం చాలా ఎక్కువ. దీంతో పోలిస్తే టాటా గ్రూప్ కంపెనీల విలువలు కూడా చిన్నగా ఉన్నాయి. BSEలో జాబితా చేయబడిన ఐదు టాటా గ్రూప్ కంపెనీలు - టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ (రూ.7,163.79 కోట్లు), టాటా కాఫీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ (రూ.3,726.07 కోట్లు), టాటా మెటాలిక్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ (రూ.2,461.31 కోట్లు), టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ (3,168.28,), నెల్కో మార్కెట్ క్యాప్ (రూ.1,589.42 కోట్లు)గా ఉంది. కానీ ఒక్క ఎల్ఐసీ వద్ద 20 వేల కోట్లు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఎల్‌ఐసీతో పాటు బ్యాంకుల వద్ద కూడా రూ.24,356 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి రూ.19,686 కోట్లు క్లెయిమ్ చేయని మొత్తంగా ఉన్నాయి. LIC IPO నుంచి ప్రభుత్వం ఐదు శాతం వాటాను విక్రయిస్తుంది. ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (DIPAM) ప్రకటన ప్రకారం.. ఇది 283 మిలియన్లకు పైగా పాలసీలను, ఒక మిలియన్ కంటే ఎక్కువ ఏజెంట్లను కలిగి ఉంది.