Tilak Mehta: 13 ఏళ్ల వయస్సులో రూ.100 కోట్ల సంపాదన.. 200 మందికి ఉద్యోగాలు.. ఈ బుడ్డోడి గురించే తెలిస్తే ఔరా అనాల్సిందే..!
Tilak Mehta Story: ముంబయికి చెందిన 13 ఏళ్ల తిలక్ మెహతా.. రూ. 100 కోట్ల విలువైన కంపెనీని స్థాపించాడు. దీని ద్వారా 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు.
Tilak Mehta’s Dabbawala initiative: కేవలం 13 ఏళ్ల వయసులో రూ. 100 కోట్ల విలువైన కంపెనీని స్థాపించిన ముంబై నివాసి తిలక్ మెహతా ఔరా అనిపిస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటూ, చదువుకుంటూ, సరదాగా గడిపే కాలంలో తిలక్ 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు.
అలసట నుంచి వచ్చిన వ్యాపార ఆలోచన..
తిలక్ మెహతా తన తండ్రి అలసట నుంచి తన వ్యాపారం గురించి ఆలోచించాడు. నిజానికి, తిలక్ తండ్రి విశాల్ మెహతా సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే బాగా అలసిపోతుండేవాడు. దీనివల్ల తిలక్ తన తండ్రిని బయటికి వెళ్లమని లేదా ఏదైనా తీసుకురావాలని ఎప్పుడూ అడగలేదు. చాలా సార్లు తిలక్ తన కాపీని, పెన్ను తీసుకురమ్మని తండ్రిని కూడా అడగలేదు. అలాగే ఓ రోజు తనకు తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లేప్పుడు.. తనతోపాటు పుస్తకాలను కూడా తీసుకెళ్లాడు. కానీ, వచ్చేప్పుడు ఆ పుస్తకాలను మర్చిపోయాడు. ఆ పుస్తకాల కోసం డెలివరీలను సహయం కోరాడు. కానీ, సాధ్యం కాలేదు.
ఆ తరువాత తిలక్ మెహతా చాలా మంది ప్రజలు ఈ రకమైన సమస్యతో పోరాడుతారని భావించాడు. ఆ తర్వాత అతనికి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. కొరియర్ సర్వీస్ ప్రారంభించాడు. అతని తండ్రి కూడా దీనికి సహాయం చేశాడు. తిలక్‌ని బ్యాంక్ ఆఫీసర్ ఘనశ్యామ్ పరేఖ్‌ని కలిసేలా చేశాడు. అతను వ్యాపార ఆలోచనను విని ఉద్యోగం మానేసి, తిలక్‌తో వ్యాపారంలో చేరాలని నిర్ణయించుకున్నాడు.
100 కోట్ల టర్నోవర్, 200 మందికి ఉపాధి..
తిలక్ తన కంపెనీకి 'పేపర్ అండ్ పెన్సిల్' అని పేరు పెట్టాడు. ఘనశ్యామ్ పరేఖ్‌ను కంపెనీకి CEO చేశాడు. మొదట్లో తిలక్ కంపెనీ బోటిక్స్, స్టేషనరీ షాపుల నుంచి చిన్న చిన్న ఆర్డర్లు తీసుకునేవాడు. ఇందుకోసం ముంబైకి చెందిన డబ్బావాలాల సాయంతో సరుకుల పంపిణీలో సాయం తీసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పని పెంచారు. తిలక్ కంపెనీలో నేడు 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారితో దాదాపు 300 మంది డబ్బావాలాలు అనుబంధం కలిగి ఉన్నారు. తిలక్ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు కాగా, దాన్ని రూ.200 కోట్లకు మించి చేరుకోవాలనుకుంటున్నారు.