Top-6 News of the Day: తిరుమలకు ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-08-12 12:30 GMT

Top-6 News of the Day(12/08/2024)

1. తిరుమలకు ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు


 తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా టీటీడీ తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే టూ వీలర్లను రెండు ఘాట్ రోడ్లలో అనుమతించనున్నారు. ఈ నెల 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని టీటీడీ తెలిపింది. వన్యప్రాణులు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంతానోత్పత్తి చేస్తాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2. కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే బెయిల్ విషయమై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేపీ విశ్వనాథన్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

3. జపోరియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు


 ఉక్రెయిన్ కు చెందిన జపోరియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రష్యా దళాలే ఈ ప్లాంట్ లో పేలుళ్లకు పాల్పడినట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించినట్టుగా రష్యా కౌంటరిచ్చింది. ఈ ప్లాంట్ ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది. ఆదివారం ప్రారంభమైన మంటలను సోమవారం ఉదయానికి అదుపులోకి తెచ్చినట్టుగా రష్యా తెలిపింది.

4. పూజా ఖేద్కర్ ను వెంటనే కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదు: దిల్లీ హైకోర్టు


 ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం పూజా ఖేద్కర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ విషయమై విచారణ నిర్వహించిన యూపీఎస్ సీ ఆమె అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై కిందిస్థాయి కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

5. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన బొత్స


 విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న విశాఖపట్టణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ నుంచి జనసేనలో చేరారు. అప్పట్లో ఆయన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. జనసేనలో చేరినందున ఆయనపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు మేరకు అనర్హత వేటు పడింది. దేశ స్వాతంత్ర్యం వచ్చింది కాంగ్రెస్ కోసం కాదు... అందరి కోసం... రాజ్యాంగ ఫలాలు నెహ్రూ కుటుంబం కోసమే కాదు... ప్రతి ఒక్కరివి అని ఆయన చెప్పారు.

6. రాహుల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు


 చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నోరు తెరవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్వతంత్ర ఫలాలాు అందరికీ అందాలనే లక్ష్యంతో మహనీయుల త్యాగాలను స్మరించుకొనేందుకు హర్ ఘర్ తిరంగా పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Tags:    

Similar News