Renault Triber Discounts: కొత్త 7-సీటర్ కార్ కొనాలా? ఈ ఫ్యామిలీ కారుపై రూ. 60,000 డిస్కౌంట్
Renault Triber Discounts: రెనాల్ట్ ట్రైబర్ ఇండియన్ మార్కెట్లో 7-సీటర్ MPV కారు ధర రూ. 6 లక్షలు. కానీ, ప్రస్తుతం మీరు ట్రైబర్‌ను మరింత తక్కువ ధరకు దక్కించుకోవచ్చు.

Renault Triber Discounts: కొత్త 7-సీటర్ కార్ కొనాలా? ఈ ఫ్యామిలీ కారుపై రూ. 60,000 డిస్కౌంట్
Renault Triber Discounts: రెనాల్ట్ ట్రైబర్ ఇండియన్ మార్కెట్లో 7-సీటర్ MPV కారు ధర రూ. 6 లక్షలు. కానీ, ప్రస్తుతం మీరు ట్రైబర్‌ను మరింత తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. ఎందుకంటే ఈ పాపులర్ మోడల్‌పై కంపెనీ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా 2025 రెనాల్ట్ ట్రైబర్ మోడళ్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 10,000 వరకు క్యాష్ బెనిఫిట్స్, రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్, ఇప్పటికే ఉన్న రూ. 10,000 వరకు అదనపు క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.
2024 రెనాల్ట్ ట్రైబర్ మోడల్‌పై రూ. 60,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 35,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ అందిస్తున్నారు.మరో వైపు ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉన్న రెనాల్ట్ కస్టమర్లకు అదనంగా రూ. 10,000 నగదు తగ్గింపులు ఉన్నాయి.
ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం, మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని డీలర్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ నాలుగు రకాల RXE, RXL, RXT, RXZ వేరియంట్‌లలో మార్కెట్లోకి వచ్చింది.
రెనాల్ట్ ట్రైబర్‌లో సిగ్నేచర్ రెనాల్ట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ క్లాడింగ్,ఫ్లేర్డ్ రియర్ వీల్ ఆర్చ్‌లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్‌గా అడ్జస్ట్ చేయగల ఔటర్ రియర్ వ్యూ మిర్రర్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ 7-సీటర్ కారు కు 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ , యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ అందించారు. రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్‌వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్‌లో 1-లీటర్ నాచురల్ యాస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 72 PS పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో వస్తుంది. ట్రైబర్ లీటరుకు గరిష్టంగా 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.