Tesla: టెస్లా కార్లను ఇండియన్స్ కొంటారా.. అసలు టెస్లా చీఫ్ కారు ఎంత ఖరీదు ఉండనుంది ?

Tesla: ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా ఇంక్. త్వరలో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మన దేశంలో దాని అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ రెండు కొత్త మోడళ్ల - మోడల్ Y, మోడల్ 3 హోమోలోగేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.

Update: 2025-03-20 12:34 GMT
Tesla

Tesla: టెస్లా కార్లను ఇండియన్స్ కొంటారా.. అసలు టెస్లా చీఫ్ కారు ఎంత ఖరీదు ఉండనుంది ?

  • whatsapp icon

Tesla: ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా ఇంక్. త్వరలో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మన దేశంలో దాని అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ రెండు కొత్త మోడళ్ల - మోడల్ Y, మోడల్ 3 హోమోలోగేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఏదైనా దేశంలో లేదా మార్కెట్‌లో వాహనాలను ప్రారంభించే ముందు హోమోలోగేషన్ సర్టిఫికేషన్ అవసరం. వాహనం దేశ చట్టాలను పాటిస్తున్నదో లేదో నిర్ధారించుకోవడానికి వాహనం డిజైన్ నుంచి దాని సేఫ్టీ ప్రమాణాల వరకు ప్రతిదీ చెక్ చేస్తారు.

భారతదేశంలో టెస్లా తొలి షోరూమ్

ఇండియాలో ప్రారంభించడానికి ముందే టెస్లా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మాక్సిటీ బిల్డింగులో 4,003 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. చైనా, అమెరికా మధ్య ద్వైపాక్షిక పెట్టుబడిపై అనేక ఆంక్షలు విధించిన తర్వాత, చైనా కార్ల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా భారత మార్కెట్‌ను ఎలాన్ మస్క్ ఎంచుకున్నారు. టెస్లాను భారతదేశానికి తీసుకురావడానికి తను చాలా ఇంట్రెస్టుగా ఉన్నాడు.

మోడల్ Y

ప్రస్తుతానికి ఇండియాలో ప్రస్తుతం టెస్లా కార్లకు బాగానే డిమాండ్ ఉంది. టెస్లా రాబోయే ఐదు సంవత్సరాలలో తయారీ, ఇతర సౌకర్యాల కోసం 30 బిలియన్ డాలర్ల పెట్టుబడిని టెస్లా కంపెనీ పెట్టవచ్చు. ఇప్పుడు టెస్లా మోడల్ Y గురించి మాట్లాడితే.. దీని ఇంటీరియర్‌లో అప్ డేటెడ్ LED లైటింగ్, మెరుగైన ఏరోడైనమిక్స్, 15.4-ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్, 8-ఇంచుల వెనుక ప్యాసింజర్ స్క్రీన్ ఉన్నాయి. దీనికి రెండు వేరియంట్స్ ఉన్నాయి. అవి RWD, లాంగ్-రేంజ్ AWD,0-100 కి.మీ./గం వేగాన్ని చేరుకోవడానికి 5.9 సెకన్లు (RWD) పడుతుంది. ఇండియాలో టెస్లా మోడల్ Y ధర దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని అంచనా.

మోడల్-3

ఇప్పుడు టెస్లా మోడల్ 3 గురించి మాట్లాడుకుందాం. లాంగ్-రేంజ్ RWD, లాంగ్-రేంజ్ AWD వేరియంట్లలో లభిస్తుంది. RWD మోడల్ 584 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది 4.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. AWD వెర్షన్ 557 కి.మీ పరిధిని , 4.2 సెకన్ల వేగాన్ని అందిస్తుంది.

మోడల్ 3 లోపలి భాగం మోడల్ Yమాదిరే ఉంటుంది. ఇందులో 15.4-ఇంచుల సెంట్రల్ స్క్రీన్, 8.0-ఇంచుల వెనుక ప్యాసింజర్ స్క్రీన్ కూడా ఉన్నాయి. అమెరికాలో టెస్లా మోడల్ 3 ధర 29,990డాలర్లు (రూ. 25.99 లక్షలు). 15శాతం ట్యాక్స్ తో భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటే దాని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.29.79 లక్షలు అవుతుంది.

Tags:    

Similar News