Mahindra: ఇదే చివరి ఛాన్స్.. ఈ కారు కొనాలంటే ఏప్రిల్‌లోపే కొనేయండి.. ధరలకు రెక్కలు వచ్చేశాయి..!
Mahindra SUV Price Hike: కారు కొనాలనుకునే వారికి బిగ్ అలెర్ట్ మీరు కూడా మహీంద్రా ఎస్‌యూవీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. ఎందుకో తెలుసుకోండి.

Mahindra: ఇదే చివరి ఛాన్స్.. ఈ కారు కొనాలంటే ఏప్రిల్‌లోపే కొనేయండి.. ధరలకు రెక్కలు వచ్చేశాయి..!
Mahindra SUV Price Hike: మహీంద్రా బ్రాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఏప్రిల్ తర్వాత వీటి ధరలు ఆకాశన్నంటనున్నాయి. ఎందుకంటే శుక్రవారమే మహీంద్రా కంపెనీ కొన్ని ఎస్‌యూవీలపై 3 శాతం వరకు ధరలు ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇవే..
దాదాపు అన్నీ కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచేశాయి. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) కూడా అదే దారి పట్టింది. తమ ఎస్‌యూవీ, కమర్షియల్ వెహికల్స్ పై 2025 ఏప్రిల్ నుంచి 3 శాతం ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రటికటించింది. దీంతో మహీంద్రా ఎస్‌యూవీలతోపాటు సీవీలు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఈ కంపెనీ ధరల పెంపునకు ప్రధాన కారణం ఇన్‌పుట్ ఖర్చలు, హై కమోడిటీ అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరు కూడా మహీంద్రా కార్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈనెలలోనే కొనేయండి.
పెరిగిన కార్ల ధరలు ఎస్‌యూవీ, సీవీ మోడల్స్‌పై ఆధారపడి ఉంటాయని అధికారికంగా మహీంద్రా కంపెనీ చెప్పింది. ఫిబ్రవరిలో తమ కార్ల విక్రయాలు 83,702 జరిగాయని చెప్పింది. దీంతో ఎగుమతులతోపాటు 15 శాతం పెరిగిందని చెప్పింది. ఇక డొమెస్టిక్ మార్కెట్‌లో 50,420 ఎస్‌యూవీలు విక్రయించగా 19 శాతం అభివృద్ధిని చెందిందని ప్రకటించింది. ఇక కమర్షియల్ వాహనాలు అయితే, డొమెస్టిక్ విక్రయాలు 23,826 జరిగాయి.
ఇక మహీంద్రా ట్రాక్టర్ (డొమెస్టిక్, ఎగుమతి) మొత్తం 2025 సేల్స్ 25,527 జరిగాయి. గత ఏడాది ఇదేనెలలో వీటి విక్రయాలు 21672 యూనిట్స్ విక్రయాలు జరిగాయి. మొత్తం 1647 ట్రాక్టర్‌లు ఎగుమతులు చేయగా.. డొమెస్టిక్ సేల్స్ ఫిబ్రవరి నెలలో 23,880 యూనిట్లు విక్రయించారు.
మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్ ఇండియా రెండు కార్ల కంపెనీలు కూడా ఇప్పటికే ధరలను పెంచేసినట్లు ప్రకటించేశాయి. కియా, టాటా మోటార్స్ కూడా ఇదే బాట పట్టాయి. ఇవి కాకుండా లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూ కూడా వచ్చే నెల నుంచి ధరలను పెంచేస్తున్నాయి. ఆటో రంగంలో ఖర్చులు పెరగడంతో కార్ల తయారీ ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచక తప్పడం లేదు. ఇది కాకుండా లాజిస్టిక్ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి.